ఒక వెర్రివాడు, జ్ఞానవంతుడుగా ఎలా కనబడగలడో నీకు తెలుసా?

బైబిల్ దృక్పధం నుండి సమ్మతించని అనేక ముఖ్యమైన అంశాలను ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది. అలానే, ఒక వెర్రివాడు, జ్ఞానవంతుడుగా ఎలా కనబడగలడో అనే వివరణతో ఇది ముగిస్తుంది!


మనతో సమ్మతించే వారితో కలిసిపోవడం చాలా సులువే. కాని మనలో పరిపక్వత మరియు విశ్వాసపు నాణ్యత, మనతో సమ్మతించని వారిని బట్టే పరీక్షింపబడుతుంది (యాకోబు 1:2-5)


🩵 మనం వింటున్నామా?

సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును. (సామెతలు 18:13)


🩵 మనం మాట్లాడకముందు ఆలోచిస్తున్నామా?

నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును (సామెతలు 15:28)


🩵 మనం కృపాసహితంగా వ్యక్తపరుస్తున్నామా?

బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. (సామెతలు 18:6,7)


🩵 మనం తగ్గింపుతో మాట్లాడుతున్నామా?

అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమితగర్వముతో ప్రవర్తించును. (సామెతలు 21:24)


మన సంబంధాలలో ఈ క్రింది రెండు వచనాలు పాటిస్తే, ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.


🌟 ఫిలిప్పీయులకు 2:3,4 - కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు, మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.


🩵 చివరిగా, కేవలం మన అభిప్రాయాన్నే పంచుకోవాలని, ఇతరులపై ఆరోపణలు వేయాలని, లేక మనం చూసినట్టే ఇతరులు కూడా చూడాలని ఆజ్ఞాపించడానికే గనుక మనం చర్చలో పాల్గొనే వారమైతే, ఈ క్రింది వచనంలో నుండి ఆఖరి జ్ఞానయుక్తమైన మాటను మనం వినాలి :


ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని అని యెంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును. (సామెతలు 17:28)


Do You Know What Makes a Fool Look Wise?


బైబిల్ దృక్పధం నుండి సమ్మతించని అనేక ముఖ్యమైన అంశాలను ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది. అలానే, ఒక వెర్రివాడు, జ్ఞానవంతుడుగా ఎలా కనబడగలడో అనే వివరణతో ఇది ముగిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.