చెరశాలలో వర్ధిల్లడం లేదా స్వేచ్ఛలో సణగటం

కుటుంబం నుండి, బంధించిన వారి నుండి హింసింపబడినా, ఒక వ్యక్తికి జయించే విశ్వాసం ఉంటే, ఇంకో వ్యక్తి అసూయ వలన సణిగే బాధితుడిగా మారిపోయాడు!


ఈ భూమిపై న్యాయం పొందటం మన హక్కు అని ఎంత వాదించినా, దేవుని వాక్యం దానిని మనకి వాగ్దానంగా ఇవ్వలేదు (2 థెస్సలొనిక 1:6,7).


కాని మనం ఆత్మీయంగా వర్ధిల్లాలంటే, మనకి న్యాయం జరగాల్సిన అవసరమేమి లేదు.


కొన్నిసార్లు మనకు అన్యాయం జరగడం వలన అది మనలో గొప్ప ఎదుగుదలకు, సేవ బలపడటానికి  దారితీస్తుంది. దానికి మంచి ఉదాహరణ యోసేపు.


• కుటుంబం నుండి హింసింపబడ్డాడు - తన పై అసూయ ఉన్న తన అన్నలు తన ఏడుపును కూడా పట్టించుకోలేదు (ఆదికాండము 42:21).


• తనను భందించినవారి నుండి హింసింపబడ్డాడు - గొలుసులతో కట్టివేయబడటం, చెరసాలలో వేయబడటం, ఒంటరితనం (కీర్తన 105:17,18).


• పొతీఫరు భార్య ప్రతీకారంతో చెప్పిన అబద్దపు సాక్ష్యం వలన - సరైన పని చేసినందుకు చెరశాలలో వేయబడటం (ఆదికాండము 39).


~ నువ్వు కూడా నీ సన్నిహితుల వల్ల తీవ్రంగా గాయపరచబడ్డావా?


~ నువ్వు కూడా దుర్వినియోగించబడ్డావా, మోసగించబడ్డావా, హింసింపబడ్డావా?


~ నువ్వు కూడా సరైన పని చేసినందుకు అపనిందలపాలయ్యవా?


బహుశా యోసేపుకు లోతైన మానసిక, శారీరిక గాయాలు ఉండి ఉండవచ్చు (ఆదికాండము 43:30), కాని తాను వాటిని ఓడించాడు.


చెరశాలలో అతను వర్ధిల్లాడు :

1. దేవునికి ఒక ప్రణాళిక ఉందని నమ్మాడు (ఆదికాండము 50:20).

2. దేవుడు, ఇతరులు తనకు వ్యతిరేకంగా చేసిన పాపాలను కూడా తన మేలుకై వాడగలరని నమ్మాడు (ఆదికాండము 50:20).

3. దేవుడు, తన ప్రయత్నాలను ఆశీర్వదిస్తారు అని నమ్మి అన్ని సందర్భాలలో ఉన్నతంగా జీవించాడు (ఆదికాండము 39:2-6, 20-23, 41:41-44).


ఈరోజుల్లో ఉన్న సంస్కృతి, ఆధునిక సలహాదారులు, 'నువ్వు బాధితుడివి' అనే మనస్తత్వం చుట్టూ నీ జీవితాన్ని కట్టుకోమని ప్రోత్సాహిస్తుంటారు.


కయీనులాగ ఉండు అని మన సంస్కృతి మనల్ని ప్రోత్సాహిస్తుంది. కాని కయీనుకున్న ఈ బాధితుడిని అనే మనస్తత్వాన్ని జయించి, యోసేపులాగా ఉండటాన్ని ఎంచుకుందామా!


కుటుంబం నుండి, బంధించిన వారి నుండి హింసింపబడినా, ఒక వ్యక్తికి జయించే విశ్వాసం ఉంటే, ఇంకో వ్యక్తి అసూయ వలన సణిగే బాధితుడిగా మారిపోయాడు!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.