సిద్ధపడు : కుటుంబం నుండి హింస రావొచ్చేమో

క్రైస్తవ్యం అంటే మన సమాజంలో విరోధ భావం పెరిగిపోతుంది, కొంతమంది కుటుంబం నుండి తృణీకరణ అనుభవిస్తున్నారు, లోక మర్యాదను అనుసరించాలని ఒత్తిడికి గురి చేస్తూన్నారు.



 కొన్ని సంవత్సరాలక్రితం, జీవితంలో కొన్ని సవాళ్ల వలన ఫిర్యాదు చేసే సమయంలో యిర్మీయ 12:5-6 ద్వారా దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది.


5 వ వచనంలో, దేవుడు, ఫిర్యాదు చేయడం మానేసి, అధిక సవాళ్ళకోసం సిద్దపడుమని యిర్మీయాతో కవిత రూపంలో చెబుతారు.


తరువాత ఆరవ వచనంలో దేవుడు యిర్మీయా జీవితంలో ఒక బాధాకరమైన విషయాన్ని బయలుపరుస్తారు. "నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు; నీ వెంబడి గేలిచేయుదురు, వారు నీతో దయగా మాటలాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు".


యిర్మీయ దైవికమైన వ్యక్తి, నైతిక విలువలు లేని రోజుల్లో దేవుని సత్యాన్ని నమ్మకంగా ప్రకటించిన వ్యక్తి. తన కుటుంబం తనను మోసం చేశారు, తనపై నిందలు వేశారు.


క్రైస్తవులు కొన్నిసార్లు "అత్యధిక ఆశావాదుల" మనస్తత్వం కలిగి ఉండటంలో అపరాదులు. ముఖ్యంగా కుటుంబానికి వచ్చేసరికి, ఎప్పుడూ ప్రతిదీ మంచిగా మారుతుంది అని ఆలోచిస్తారు.


కాని అలా జరగకపొతే? స్నేహితులను, కుటుంబాన్ని సంతోషపెట్టాలని మన విలువలను మార్చుకుంటామా? దేవుని ప్రేమతో నిండిన ఆజ్ఞలు గురించి చెప్పడం మానేస్తామా? సువార్త గురించి మన అవగాహన మార్చుకుంటామా?


యేసుని కూడా తన కుటుంబం తృణీకరించింది. మన బాధేంటో ఆయన అర్ధం చేసుకోగలరు (యోహాను 7:3-7).


మత్తయి 10 అధ్యాయంలో ఆయన తన శిష్యులను పంపేటప్పుడు ఒక హెచ్చరికనిస్తారు, మనం కూడా ఆ హెచ్చరికను తీసుకోవాలి. ఒకవేళ కుటుంబం మోసం చేసినా, ప్రపంచంమే వారిని చెడ్డవారు అని ముద్ర వేసిన, ఆత్మ నడిపింపుతో సత్యాన్నే పలకాలి అని ఆయన చెప్పారు (మత్తయి 10:16-39).


తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు (మత్తయి 10:37).


పెరగబోతున్న హింసలకు సిద్దపడాలి అనుకుంటే, మనం అత్యంత ప్రేమించేవారికంటే, యేసునే ఎక్కువ ప్రేమించాలి.



క్రైస్తవ్యం అంటే మన సమాజంలో విరోధ భావం పెరిగిపోతుంది, కొంతమంది కుటుంబం నుండి తృణీకరణ అనుభవిస్తున్నారు, లోక మర్యాదను అనుసరించాలని ఒత్తిడికి గురి చేస్తూన్నారు.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.