నా సూట్కేస్లో అవి సరిపోలేదు, అందుకనే నా షూస్ కొన్ని నా స్నేహితురాలికి ఇచ్చాను.
అవి ఆమె సైజు కాదు, కాని అవి దాదాపు కొత్తవి, దాదాపు ఆమె సైజే కాబట్టి అవి సరిపోతాయి అని అనుకుంది. కాని అవి ఆమెకు అంత సౌకర్యవంతముగా లేవు.
ఒక మధ్యాహ్నం అవి వాడుతున్న సమయంలో, దేవుడు ఆమె ఎలా ఉండాలని, ఆమె ఏమి చేయాలని కోరుతున్నారో అనే కొన్ని ప్రశ్నలతో ఆమె నిండిపోయింది. అలాంటి సమయంలో ఆమెకు ఒక వెలుగింపు కలిగింది : "వేరే వారిలా ఉండాలని ప్రయత్నించడం ఆపు. నువ్వు ఎప్పటికీ ఇతరుల షూస్ ని నింపలేవు" అని.
"ఆహా, ఇదేంత స్వాతంత్రాన్నిచ్చే క్షణం", అంది ఆమె. ఆమె సైజు దేవునికే తెలుసు. ఆమె కోసమే ప్రత్యేకంగా నిర్ణయించబడిన ప్రణాళికలు దేవునికున్నాయి (ఎఫెసీ 2:10).
నువ్వు కూడా వేరే వారిలా ఉండాలని కోరుకున్నావా : ఇంకా చిన్న వయస్సు ఉంటే, ఇంకా పెద్ద వయస్సు ఉంటే, పెళ్ళైతే, ఒంటరిగా ఉంటే, పొడుగ్గా ఉంటే, పొట్టిగా ఉంటే, లేక వేరే తలాంతులతో లేక సామర్ధ్య్యాలతో ఉంటే? అని
ఇతరులలో ఉన్న దైవికమైన ప్రవర్తనను, విశ్వాస్యతను, భయభక్తులను అనుకరించవచ్చు కాని వారి వ్యక్తిత్వాలను కాదని, అలానే ఇతరుల జీవితాలను చూసి ఆశపడకూడదని దైవ లేఖనాలు చెబుతున్నాయి. (1 కొరింథీ 11:1, ఫిలిప్పీ 3:17).
ఒకొక్కరికోసమే ప్రత్యేకంగా దేవుడు ప్రణాళికలు రూపొందించారు.
కనుక నీ షూస్ లోనే కాలు పెట్టి, దేవుడు నీకిచ్చిన తలాంతులు, వ్యక్తిత్వం, ఎంత వరకు నువ్వు ప్రభావితం చేయడానికి ఆయన నిర్ణయించారో వీటన్నింటిని బట్టి ఆయన నిర్దేశించిన మార్గంలో నిన్ను నడిపించమని ఆయనను అడుగు.
Slip On Your Own Shoes – Ephesians 2:10


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.