"ప్రతీరోజూ ఒకోరోజుగా" : బైబిల్ సూత్రం

రోజువారీ సవాళ్ళను ఎదుర్కోవడానికి మత్తయి 6 లో కొన్ని ముఖ్యమైన సూత్రలు ఉన్నాయి!


"ప్రతీరోజూ ఒకోరోజుగా" టీవి షాల్లో ఇది ఒక పాట. కాని ఇది మన రోజూవారీ ఒత్తిడిని ఎదుర్కోవడానికి బైబిల్ ఇచ్చే మంచి సూత్రం కూడా.


మత్తయి 6 లో మన రక్షకుని నుండి మనకు సహాయపడే అద్భుతమైన సలహా ఉంది. చింతించడం మరియు ప్రాధాన్యతలు గురించిన మాటతో అది ముగిస్తుంది.


రేపటినిగూర్చి చింతింపకండి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును (మత్తయి 6:34).


ఆరోగ్యకరమైన క్రైస్తవ జీవితానికి ఇది చాలా కీలకమైనది. అంతే కాకుండా దీనికి పై వచనంలో చాలా ముఖ్యమైన సత్యం ఉంది. "ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి" (మత్తయి 6:33).


సంబంధాల్లో ఉండే సంవత్సరానికి సరిపడా సమస్యలను 24 గంటల్లో వ్యవహరించగలమా? అలానే ఆర్ధిక సవాళ్ళు లేక ఆరోగ్య సమస్యల సంగతేంటి?


కీడు జరగకుండా మనం తప్పించుకోలేము కాని, దేవుని ఉద్దేశాలను వెదకడం ద్వారా, ఏరోజుకారోజు ఆయనను నమ్ముకోవడం వలన ఆందోళన నుండి మాత్రం తప్పించుకోగలము.


దేవునికి మన భవిష్యత్తు తెలుసు, మనకు జరిగే కీడును కూడా మన మేలుకై ఉపయోగిస్తారనే ఆయన వాగ్దానం మనకుంది (1 యోహాను 5:1-5; రోమా 8:28).


కనుక రేపు, ఆ తరువాత రోజు, అటు తరువాత రోజు దేవుని రాజ్య ప్రణాళికలను వెదకడానికి నిద్ర లేద్దాం. ఆ రోజుకు సరిపడా బలాన్ని, ధైర్యాన్ని దేవుడు ఇస్తారని నమ్ముదాం.


One Day at a Time: A Biblical Principle


రోజువారీ సవాళ్ళను ఎదుర్కోవడానికి మత్తయి 6 లో కొన్ని ముఖ్యమైన సూత్రలు ఉన్నాయి!



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.