ఆరు దర్శనముల నెరవేర్పు

ఒక్క నిమిషంలోనే చదవగలిగిన ఈరోజు వాక్యధ్యానంలో దేవుడు యోసేపును నమ్మి ఆరు దర్శనాలను అప్పగించడానికిగల అయిదు కారణాలను మీరు తెలుసుకోవచ్చు!


యోసేపు యొక్క జీవితం ఆరు దర్శనాలలో ముడిపడి ఉంది : రెండు తన గమ్యం గురించి, రెండు తనతో పాటు చెరసాలలో ఉన్న ఇద్దరు ఖైదీల గురించి మరియు మిగతా రెండు ఐగుప్తు యొక్క గమ్యం గురించినవి (ఆదికాండము 37-41)

అసలు దేవుడు ఎందుకు యోసేపును నమ్మి ఈ దర్శనాలను అప్పగించాడు? 

యోసేపు జీవితంపై దేవునికి ఒక ఉద్దేశ్యం ఉంది మరియు యోసేపులో ఈ దైవికమైన లక్షణాలు ఉన్నాయి :

1. యోసేపు దేవునికి మాత్రమే పూర్తి ఘనతను ఇచ్చే వ్యక్తి (ఆదికాండము 40:8, ఆదికాండము 41:15-16)
దేవుని ద్వారా పొందిన సామర్ధ్యాలు అంతర్దృష్టి,  మరియు అనుగ్రహాలను బట్టి తాను  ఘనతను పొందాలని యోసేపు అసలు ఎన్నడూ ప్రయత్నించలేదు. 

2. యోసేపు ఓర్పు సహనం కలిగిన వ్యక్తి. పదమూడు సంవత్సరాలు బానిసత్వం అనుభవించాడు, ఇవవై రెండు సంవత్సరాలు తన కుటుంబం నుండి ఎడబాటును అనుభవించాడు. 

3. యోసేపు పాపము చేత దారి తొలగిపోవడాన్ని తిరస్కరించే వ్యక్తి (ఆదికాండము 39:6-18). 
తనకి వ్యక్తిగతంగా చాలా నష్టం కలుగుతుంది అని తెలిసినా పోతీఫరు భార్య యొక్క చెడు ప్రేరేపణని యోసేపు తిరస్కరించాడు. 

4. దేవుడు తనతో ఉన్నాడు గనుక యోసేపు ఎంతో క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నాడు. (ఆదికాండము 39:2, 23)

5. పాపులు కూడా దేవుని ప్రణాళికలను అడ్డుకోలేరు అని యోసేపుకి బాగా తెలుసు. (ఆదికాండము 50:20)

ఆదికాండము 50:20 కూడా రోమీయులకు 8:28 లాగే విశ్వాసంతో కూడిన ఒక గంభీరమైన తీర్మానముగా మనకు కనబడుతుంది. 

దేవునికి మనలో ప్రతీఒక్కరి జీవితాలకు సంబంధించి ఒక ప్రణాళిక ఉంది (ఎఫెస్సీయులకు 2:10), అది యోసేపు జీవితం ద్వారా మనం బాగా గ్రహించగలం.


ఒక్క నిమిషంలోనే చదవగలిగిన ఈరోజు వాక్యధ్యానంలో దేవుడు యోసేపును నమ్మి ఆరు దర్శనాలను అప్పగించడానికిగల అయిదు కారణాలను మీరు తెలుసుకోవచ్చు !

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.