నేనెలా ఉన్నా కూడా దేవుడు నన్ను ప్రేమిస్తాడు


క్రైస్తవులకు రక్షణ అనేది దేవుడిచ్చిన ఉచితమైన బహుమానం.. దానికి స్పందనగా తమంతట తామే యేసు ప్రభువు ఆశించేవి వారు చేస్తారు. ఈ ఒక్క నిమిషం లో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం దేవుడు మనం నుండి ఆశించే మూడు విషయాలను తెలియజేస్తుంది.


దేవుడు మనల్ని తన రాజ్యం లోనికి ఉన్నపళంగానే అంగీకరించవచ్చు కాని మనలో మార్పును ఆయన ఆశిస్తారు.

అందుకే రక్షణ మనం సంపాదించలేని ఉచితమైన బహుమానం అయినా మనం పరిశుద్దతను పొందే విధానానికి మాత్రం శ్రద్ద, విధేయత, నిబద్దత చాలా ముఖ్యం అని దేవుని పరిశుద్ధ గ్రంధం బోధిస్తుంది (ఫిలిప్పీయులకు 3:7-21, 2 పేతురు 1:10-11)

మనం పాపం చేసినపుడు దేవుని ప్రేమను పోగొట్టుకుంటామేమో అనే చింత మనకు ఉండకూడదు ఎందుకంటే దేవుని ప్రేమ అంత బలహీనమైనది కాదు.. అలా అని దేవుని ప్రేమ మన నుండి ఏమి ఆశించదు అని అనుకోవడం తప్పు. 

దేవుడు మన నుండి ఆశించేవి :

1. మన స్వంత ప్రణాళికలు, మార్గాలు విడిచిపెట్టి దేవునివి వెంబడించాలి (మత్తయి 16:24-27, యాకోబు 2:14-26)
2. దేవుని ఆజ్ఞలకు లోబడాలి (1యోహాను 2:3 ; 1యోహాను 5:3)
3. క్రీస్తులో మనం ఎదుగుతూ ఉండాలి (ఫిలిప్పీయులకు 2:12-13)

మనలను మనం తృణీకరించుకొనే కఠినమైన మార్గం ఎంచుకోవడం మనలో ఎవ్వరికీ సహజంగా ఇష్టం అనిపించదు. కాని మనం క్రైస్తవులము అయినప్పుడు దీనికే మనం కట్టుబడి ఉంటాము అని మన దేవునికి మనం మాట ఇచ్చినట్టు (లూకా 25:14-33)

మనం ఎలా ఉన్నామో అలానే ఉంటాము అనే స్వభావాన్ని అంగీకరించము అని మనం ఒప్పుకోని, దేవుడు కోరుకునే వ్యక్తిగా మారడానికి మనం నిత్యం కృషి చెయ్యాలి. 

ఎందుకని? ఎందుకంటే యేసుక్రీస్తు మనలను ప్రేమిస్తున్నారు మనం కూడా ఆయనను ప్రేమిస్తున్నాము గనుక !


క్రైస్తవులకు రక్షణ అనేది దేవుడిచ్చిన ఉచితమైన బహుమానం.. దానికి స్పందనగా తమంతట తామే యేసు ప్రభువు ఆశించేవి వారు చేస్తారు. ఈ ఒక్క నిమిషం లో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం దేవుడు మనం నుండి ఆశించే మూడు విషయాలను తెలియజేస్తుంది.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.