ఒంగిపోయిన ఆకారం



ప్రతికూల పరిస్థితుల్లో సహితం తగ్గింపు కలిగి ఉండటానికి శ్రేష్టమైన మాదిరి యేసు క్రీస్తు ప్రభువు...

అన్యాయం అనేది మానవ జీవితంలో ఒక భాగం అయినప్పటికీ, ఎవరైనా నన్ను చిన్నచూపు చూసినప్పుడు నేను ఉండాల్సిన ఆకారం నుండి ఒంగిపోతూ ఉంటాను !

అలా ఒంగిపోకుండా ఉండటానికి నాకున్న ఒకే ఒక్క నిరీక్షణ క్రీస్తు యేసు యొక్క మనస్సును ధ్యానించడమే !

క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. (ఫిలిప్పీయులకు 2:5-8)

• దేవుడైవుండి, ఆయన దెయ్యం అని పిలవబడ్డారు.
• ప్రేమ అయి ఉండి, ఆయన ద్వేషించబడ్డారు.
• ఏ కపటం లేనివాడయ్యుండి, ఆయన సిలువ వేయబడ్డారు.
• రాజులకు రాజైయుండి, ఆయన దాసుడయ్యారు.
• నీతిమంతుడైయుండి, ఆయన మన నిందను భరించారు.
• ఏ పాపం లేనివాడయ్యుండి, ఆయన మన పాపముల కోసం మరణించారు.

ఇవన్నీ పూర్తిగా అన్యాయాలే ..

కాని దేవుడు మనం పొందిన అవమానాలు లేక అన్యాయాలు తిరిగి ఇతరులకు ఉపయోగపడేలాగ చేయగలరు అలానే క్రీస్తు యేసు యొక్క మనస్సును ధరించుకునేలాగ మనల్ని వాటి ద్వారా తర్ఫీదు చేయగలరు.

అన్యాయం చేయబడినప్పుడు, నేను, నేను ఉండవలసిన ఆకారం నుండి ఒంగిపోవచ్చు లేక సరైన ఆకారంలోకి ఒదిగిపోవచ్చు... "ఆ సరైన ఒదుగుదల" పొందడం కోసం ఆ దేవుణ్ణి మనం అడుగుదామా?





Bent Out of Shape

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.