ఏ కాడిని ఎంచుకున్నావు?

ఆధ్యాత్మిక చరిత్రలో ఇది చాలా కఠినమైన సమయం. కనుక మనం లోకపు కాడిని కాక క్రీస్తు యొక్క కాడినే మోసేలాగా జాగ్రత్తపడాలి. దీనినే ఈ ఒక్క నిమిషం లో చదువగలిగే ఈరోజు వాక్య ధ్యానం వివరిస్తుంది.


1 యోహాను 5:3 లో దీనికి స్పష్టమైన క్లుప్తమైన వివరణను మనం చూడొచ్చు :

మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. (1 యోహాను 5:3)

మత్తయి 11:28-30 లో ఆయన కాడిని మోసి ఆయన యొద్ద నేర్చుకోమనే యేసు ప్రభుని ఆహ్వానం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.. ఎందుకంటే 'ఆయన కాడి సుళువుగాను ఆయన భారము తేలిక గాను' ఉన్నవి కాబట్టి.

ఈలోకంలో మనము కలిసిపోవడం, పాపాన్ని వ్యతిరేకించకుండా ఉండటం, పేరు ప్రఖ్యాతలు పొందటం, ధనం సంపాదించి సుఖపడటం అనేవి చాలా తేలిక అని ఈ లోకం మనలను నమ్మిస్తుంది. 

దేవుని ప్రేమపూర్వకమైన, మధురమైన, జ్ఞానయుక్తమైన, జీవితాలను మార్చే శక్తి కలిగిన ఆయన ఆజ్ఞలు చాలా భారమైనవని ఇంకా చెప్పాలంటే ద్వేషించదగ్గవని మనల్ని నమ్మించడానికి సాతానుడు చాలా శ్రద్దతో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. 

ఆధ్యాత్మిక చరిత్రలో ఇప్పుడు చాలా కఠినమైన సమయం నడుస్తుంది. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపకుండా ఆయనను ప్రేమించడం అసాధ్యమని, అలానే ఆయన కాడిని మోస్తేగాని మన ప్రాణాలకు నిజమైన విశ్రాంతి దొరకదు అనే వాస్తవాలను ఎప్పటికప్పుడు మనలకు మనం గుర్తుచేసుకుంటూ ఉండాలి. 

ఒకవేళ నువ్వు ఊగిసలాడే వ్యక్తిగా ఉన్నట్లయితే, ఈ లోకపు కాడి తేలికైనదిగా అనిపించినా అది చివరికి పాపానికి, దాస్యానికే నిన్ను నడిపిస్తుంది అని.. అలానే యేసు ప్రభువు యొక్క కాడి బరువైనదిగా అనిపించినా నిజానికి అది పాపం నుండి నిన్ను విడిపించి నిత్యత్వపు పరిపూర్ణమైన ఆనందాన్ని నీ స్వంతం చేస్తుంది అనే స్పష్టమైన వాస్తవాలని నువ్వు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.



ఆధ్యాత్మిక చరిత్రలో ఇది చాలా కఠినమైన సమయం. కనుక మనం లోకపు కాడిని కాక క్రీస్తు యొక్క కాడినే మోసేలాగా జాగ్రత్తపడాలి. దీనినే ఈ ఒక్క నిమిషం లో చదువగలిగే ఈరోజు వాక్య ధ్యానం వివరిస్తుంది.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.