ఇతరులు నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ


ఇతరులు మనయెడల చాలా కఠినంగా ప్రవర్తించినప్పటికీ, "దానికి వ్యతిరేకంగా మనం నడవగలం". ఈ ఒక్క నిమిషంలో చదవగలిగిన వాక్యధ్యానం దానిని వివరిస్తుంది.

మనం నమ్మకంగా ఉండగలం... అది మనం ఒక్కరమే అయినప్పటికీ.. 

ఇతరుల యొక్క ప్రవర్తన అలా ఉంది కాబట్టే నా ప్రవర్తన ఇలా ఉంది అని చెప్పడం చాలా సులభం, కాని అపోస్తులుడైన పౌలు 2 కొరింధీయులకు 10:12 లో ఈ విధంగా చెప్పాడు "తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింప జాలము గాని, వారు తమలోనే యొకరిని బట్టి యొకరు ఎన్నికచేసికొని యొకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున, గ్రహింపులేక యున్నారు."

అయినను ఇతరులు తప్పు చేస్తున్నప్పటికీ మనం తప్పకుండ సరైనదే చేయాలి :

•ఇతరులు అహంకారంతో ఉన్నప్పటికీ మనం దీనత్వంలో నడవాలి. 

•ఇతరులు వారి పాపాలకు సాకులు చెప్పి సమర్ధించుకున్నప్పటికీ మనం తప్పకుండ వాటిని బట్టి పశ్చాత్తాపపడి ఒప్పుకోవాలి. 

•ఇతరులు ఈ ప్రపంచంలోని ప్రాముఖ్యమైన పాపాలను అంగీకరించినప్పటికీ మనం మాత్రం వాటిని ఎదిరించి నిలబడాలి.

•ఇతరులు అసహనంగా ఉన్నప్పటికీ మనం సహనంగా ఉండాలి. 

•ఇతరులు దేవుని వాక్యాన్ని నిరాకరించినా లేక నీరుకార్చినా మనం మాత్రం దేవుని వాక్యంలో స్థిరంగా నిలబడాలి. 

•ఇతరులు దేవునికి అవిధేయులుగా ఉన్నప్పటికీ మనం మాత్రం విధేయులుగా ఉండాలి. 

•ఇతరులు తమ స్వంత రాజ్యాలను వెతుకుతున్నప్పటికీ మనం మాత్రం దేవుని రాజ్యాన్నే వెతికే వారిగా ఉండాలి.

క్రీస్తు సంఘములో చాలా మంది వేషధారులు ఉన్నారు అని మత్తయి 13:24-30 లో చెప్పబడింది. మనం వారిచేత ప్రభావితం చేయబడకూడదు కాని మనమే క్రీస్తు కోసం వారిని ప్రభావితం చెయ్యాలి. 

7 Ways to Walk in the Opposite Spirit
ఇతరులు మనయెడల చాలా కఠినంగా ప్రవర్తించినప్పటికీ, "దానికి వ్యతిరేకంగా మనం నడవగలం". ఈ ఒక్క నిమిషంలో చదవగలిగిన వాక్యధ్యానం దానిని వివరిస్తుంది.




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.