రోజురోజుకి మారిపోతుంది జాగ్రత్త!

ఈ ఒక్క నిమిషం లోనే చదువగలిగిన వాక్యధ్యానం, యేసు ప్రభువును వెంబడించే ప్రతీ ఒక్కరి జీవితాల్లో జరిగే రెండు ముఖ్యమైన సంగతులను వివరిస్తుంది !

ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రభలమయ్యే భిన్నమైన అభిప్రాయాలలో, "క్రైస్తవ్యం అంటే బాధ్యత లేనిది" అనేది బహుశా ప్రాముఖ్యత పొందింది అనడంలో సందేహం లేదు !


రక్షణ విశ్వాసం ద్వారానే తప్ప మంచి క్రియల ద్వారా సంపాదించగలిగేది కాదు.


కాని రక్షణ ఎప్పుడు కూడా విధేయతలోనికి, మంచి క్రియలలోనికి నడిపిస్తుంది. 



విశ్వాసం ద్వారా ప్రేరేపించబడిన విధేయత :

ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాప మందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము? (రోమీయులకు 6:1-2)

అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను అనునది (2 తిమోతికి 2:19)

మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము. (1 యోహాను 2:3)

విశ్వాసం ద్వారా ప్రేరేపించబడిన మంచి క్రియలు :

ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. (యాకోబు 2:17)

మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసు నందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. (ఎఫెసీయులకు 2:10)

మనం విశ్వాసానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి! ఎందుకంటే మనం సేవించే మన రక్షకుడు మన శ్రేష్టమైన అతి ఉన్నతమైన కృషిని పొందడానికి ఎంతైనా అర్హుడు (ఫిలిప్పీయులకు 2:21)

ఈ ఒక్క నిమిషం లోనే చదువగలిగిన వాక్యధ్యానం, యేసు ప్రభువును వెంబడించే ప్రతీ ఒక్కరి జీవితాల్లో జరిగే రెండు ముఖ్యమైన సంగతులను వివరిస్తుంది !

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.