చిన్న బిడ్డ యొక్క సహనం

ఒక్క నిమిషంలోనే చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం చిన్న బిడ్డలు, మళ్ళీ మళ్ళీ చేయడం, విసుగు చెందడం అనే వాటి గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులను, అలానే మన ప్రియమైన దేవుని గురించిన అద్భుతమైన వైఖరిని కూడా వివరిస్తుంది!

చిన్న పిల్లలు చేసిందే చేయడానికి విసుగుచెందరు. చేసిందే మళ్ళీ మళ్ళీ చేయడంలో వారు ఆనందాన్ని పొందుతారు. నా మనవాళ్లకు ఆటలు ఆడటానికి అత్యంత ఇష్టమైన జెట్టు నా భర్తే, ఎందుకంటే ఒకే ఆటను ఆయన ఎన్ని గంటలైనా ఎన్ని సార్లైనా వాళ్ళతో ఆడతారు. 

చాలా మంది పెద్దవారు (నాతో సహా) చేసిందే మళ్ళీ మళ్ళీ చేయడం అవసరం అని తెలిసినా కూడా, చేయడానికి మాత్రం విసిగిపోతూ ఉంటారు.

 ఈ "పెద్దవారి వైఖరి" దేవునికి మాత్రం ఉండదేమో అని నేను అనుకుంటాను. 

ఆయన ప్రతీ సూర్యోదయాన్ని, ప్రతీ సూర్యాస్తమయాన్ని ఆనందిస్తారు, ప్రతీ చిన్న బిడ్డ పుట్టినపుడు నవ్వుతారు, వసంత కాలంలో పూసే ప్రతీ పుష్పాల యొక్క సువాసనను ఆస్వాదిస్తారు, మరియు ప్రతీ యొక్క అలలు దాని తీరాలను తాకడాన్ని కూడా ఎంతో ఇష్టంగా కనిపెడుతూ ఉంటారు.

ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను? ఎందుకంటే ఇతర విషయాలలో ఆయన నమ్మశక్యం కాని సహనాన్ని చూపూతూ ఉన్నారు కాబట్టి. ప్రతీ రోజూ లక్షలాది మంది యొక్క ప్రార్థనలను ఆయన వింటున్నారు అలానే వేల సంవత్సరాలుగా మానవులకు ఉన్న అవే సమస్యలతో ఆయన వ్యవహరిస్తూ ఉంటున్నారు. 

ఎంతో తరచుగా ఆయన ప్రతీ వ్యక్తిని క్షమిస్తారు, సరిచేస్తారు, రక్షిస్తారు, విడిపిస్తారు మరియు సూచిస్తారు అనేవి ఆలోచించడానికే నేను తడబడిపోతున్నాను.

"ఆయన సొమ్మసిల్లడు, అలయడు.. సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. (యెషయా 40:28-29)

మళ్ళీ మళ్ళీ నా పట్ల కృప చూపించే, క్షమించే నా దేవునికి ఈరోజు నేనెంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయనకు స్తుతులు చెల్లించుటలో నేను కూడా ఎప్పటికీ సొమ్మసిల్లక, అలయక ఉండును గాక !

The Patience of a Child


ఒక్క నిమిషంలోనే చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం చిన్న బిడ్డలు, మళ్ళీ మళ్ళీ చేయడం, విసుగు చెందడం అనే వాటి గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులను, అలానే మన ప్రియమైన దేవుని గురించిన అద్భుతమైన వైఖరిని కూడా వివరిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.