"నాయనా తండ్రీ" అని దేవుని పిలుచుట - గలతీయులకు 4:6


ఈ సత్యం మనకు గొప్ప ధైర్యాన్ని, ఆదరణను ఇస్తుంది. ఈ ఒక్క నిమిషం లో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం నీకు తప్పక ప్రోత్సాహాన్నిస్తుంది !


నా తల్లి, తాను అమ్మమ్మ అయినా కూడా తన జీవితం అంతా తన తండ్రిని "నాన్న" అనే పిలిచేది. 

ఆమె చాలా కాలంగా తన భూసంబంధమైన తండ్రిపై ఇదివరకులాగా "ఆధారపడకపోయినా", "నాన్న" అని ఆమె ఉపయోగించే ఆ పదం పసిపిల్లలు చూపించేవంటి గౌరవం, మాధుర్యం, ఆప్యాయత, మర్యాదలను కనుపరుస్తూనే ఉండేది.

"నాయనా" అనే పదం కూడా ఇలాంటిదే. 

ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. (రోమీయులకు 8:15,16)

"నాయనా" అనే పదం "నాన్న" లేక "తండ్రి" అనే పదాల నుండి వచ్చినదే. ఈ పదం పసిపిల్లలు ఆధారపడుతూ గారాబంతో ఉపయోగించే పదం వంటిది. దీనినే గలతీయులకు 4:6 and మార్కు 14:36 లో కూడా మనం చూడగలం. 

దేవుడే ఒక సంపూర్ణమైన తండ్రిగా మనతో బంధాన్ని కలిగి ఉండటాన్ని కోరుకున్నారు, భూసంబంధమైన మంచి తండ్రుల వలే ఆయన కూడా మనకి మంచివే దయచేస్తారు (మత్తయి 7:7-11), ప్రేమతో మనలను క్రమశిక్షణలో పెడతారు (హెబ్రీయులకు 12:4-11), మనపై ఎంతో కనికరం కలిగి ఉంటారు ( కీర్తనలు 103:13), మరియు మనలను పోషిస్తారు (మత్తయి 6:26)

ఎప్పుడైతే మనం క్రైస్తవులం అవుతామో అప్పుడే మనం "నాన్న" అని పిలువగలిగే దేవుడు మనకి అందుబాటులో ఉన్నారు అని గుర్తించగలం (గలతీయులకు 4:6). ఇది ఎంతో అద్భుతం అని నాకు అనిపిస్తుంది !


ఈ సత్యం మనకు గొప్ప ధైర్యాన్ని, ఆదరణను ఇస్తుంది. ఈ ఒక్క నిమిషం లో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం నీకు తప్పక ప్రోత్సాహాన్నిస్తుంది !

1 comment:

  1. Sorry a small correction
    "పాదాలు కాదు పదాలు"

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.