శాంతిని ఎలా కలిగి ఉండగలం

 యేసు ప్రభువు యోహాను 16:33 లో మన కోసం ఎంతో విలువైన విషయాన్ని బోధించారు, అది మన నిత్యత్వపు దృక్పధాన్ని పూర్తిగా మార్చివేసేది... తప్పకుండ మార్చివేస్తుంది.


ఈ మధ్యకాలంలో నా స్వాధీనంలోలేని వాటి గురించి ఎంతో చింతుస్తు ఉన్నాను.  "వదులుకోవడం మరియు ధరించుకోవడం" లో నేను నమ్మకంగా లేను అనేదానికి నాలో ఉన్న ఈ చింత ఒక సూచనగా ఉంది అనడంలో సందేహం లేదు.

కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. (ఎఫెసీయులకు 4:22-24)

యేసు ప్రభువు మన యొక్క భూసంబంధమైన సమస్యలు, ఇబ్బందులు అర్ధం చేసుకున్నారు అందుకే వాటిని నిత్యత్వపు దృక్పధంతో చూడమని చెప్పారు : నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను. (యోహాను 16:33)

"కావున మేము అధైర్యపడము; మా బాహ్యపురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది". (2 కొరింథీయులకు 4:16, 17).. పౌలు కూడా అదే విషయాన్ని ఈ వాక్యంలో ప్రతిధ్వనింపజేశారు.

నేను నిత్యత్వపు దృక్పధం (నిత్యత్వపు వెలుగులో పరిస్థితులను చూసే విధానం) కోసం దేవునికి మొఱ్ఱపెడుతున్నాను. మరి నీ సంగతి ఏమిటి?
  

A Key to Having Peace

యేసు ప్రభువు యోహాను 16:33 లో మన కోసం ఎంతో విలువైన విషయాన్ని బోధించారు, అది మన నిత్యత్వపు దృక్పధాన్ని పూర్తిగా మార్చివేసేది... తప్పకుండ మార్చివేస్తుంది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.