నువ్వు చెల్లించవలసిన వెల ఎపుడైనా లెక్కించావా?


చాలామంది ఆధునిక క్రైస్తవులు, క్రీస్తును వెంబడించడానికి ఎలాంటి వెల చెల్లించవలసిన అవసరం లేదు అనుకుంటారు.. కాని ఆ వైఖరి దేవుని వాక్యానికి పూర్తిగా భిన్నమైనది. అది ఎలానో ఈ ఒక్క నిమిషంలో చదువగలిగిన వాక్యధ్యానం వివరిస్తుంది !


సత్క్రియలు మరియు విధేయత మనకు రక్షణను సంపాదించలేవు కాని యదార్ధమైన రక్షణ మనలను ఎప్పుడూ సత్క్రియలు మరియు విధేయతలోనికి నడిపిస్తుంది. 


యోహాను 15:10 ప్రకారం యేసు ప్రభువు ఏమి బోధించారు అంటే "... మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమ యందు నిలిచియుందురు. (యోహాను 15:10)

రక్షణకు విధేయతకు ఉన్న సంబంధాన్ని దేవుని వాక్యంలో ఈ వచనాల ద్వారా చాలా స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. అవి : యోహాను 8:51; యోహాను 14:15; యోహాను 14:21; యోహాను 14:23; 1 యోహాను 2:3; 1యోహాను 3:6; 1యోహాను 5:3; 2 యోహాను 1:6.

చాలా మంది సువార్తను నీరుకార్చాలనే ఉద్దేశంతో దేవుని కృపలో ఉన్నవారు, వారి పాపముల గురించి అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తుంటారు. అందుకే ఈ సత్యాలను మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. 

ఆది సంఘంలోని వారు కూడా ఇదే వైఖరిని కలిగి ఉండటం పౌలు ఎదుర్కోవాల్సివచ్చినప్పుడు వారికి ఈ విధంగా చెప్పడం జరిగింది, "ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?" (రోమీయులకు 6:1,2)


అందుకే యేసు ప్రభువు మనలో ప్రతీ ఒక్కరికీ రక్షణను అంగీకరించేముందు మనం చెల్లించవలసిన వెలను కూడా లెక్కించమని చెప్తున్నారు (మత్తయి 10:38; లూకా 14:25-35), ఎందుకంటే రక్షణ అనేది నూతన జీవితానికి ప్రారంభం (2 కొరింధీయులకు 5:17), తన్ను తాను ఉపేక్షించుకోని జీవించడం (మత్తయి 16:24), మరియు దానిని కొనసాగించడం అనేది అత్యంత ప్రాముఖ్యమైన పని (ఫిలిప్పీయులకు 2:12-13; ఎఫెస్సీయులకు 2:10)

ఈ సత్యాన్ని నీవు గ్రహించావా?



చాలామంది ఆధునిక క్రైస్తవులు, క్రీస్తును వెంబడించడానికి ఎలాంటి వెల చెల్లించవలసిన అవసరం లేదు అనుకుంటారు.. కాని ఆ వైఖరి దేవుని వాక్యానికి పూర్తిగా భిన్నమైనది. అది ఎలానో ఈ ఒక్క నిమిషంలో చదువగలిగిన వాక్యధ్యానం వివరిస్తుంది !

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.