క్రీస్తులోని జీవితానికి నాలుగు ముఖ్య లక్షణాలు

ఎవరైతే యేసు ప్రభువును యదార్ధమైన హృదయంతో ప్రేమిస్తారో వారిలో మాత్రమే ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తాయి, నామకార్ధపు క్రైస్తవులలో మాత్రం అవి కనిపించవు. ఆ నాలుగు లక్షణాలు ఏమిటో ఈ ఒక్క నిమిషంలో చదువగలిగిన వాక్యధ్యానంలో తెలుసుకుందాం !



"నేను జీవము కలుగుజేయుటకు వచ్చితిని. పొందటానికి సాధ్యమైనంతగా.. సమృద్ధిగా.. ఘనంగా, తృప్తికరంగా... పరిపూర్ణంగా మరియు మంచిగా"*


క్రీస్తులో మన జీవితం క్రీస్తు సహాయంతో ఆశీర్వాదకరంగా, ఆయన నడిపింపు, ఆదరణ, శాంతి, సమాధానాలు, సంతోషాలతో ఉంటుందని మరియు మనం ఆ సంపూర్ణమైన నిత్యత్వం కోసం ఎదురుచూస్తూ ఒక ముఖ్య ఉద్దేశంతో కొనసాగాలని దేవుని వాక్యం మనలను ప్రోత్సాహిస్తుంది. 

అలానే సమృద్ధి అయిన జీవితంలో ఈ క్రిందవి కలిగి ఉంటాయని దేవుని వాక్యం చెప్తుంది :

తన్ను తాను ఉపేక్షించుకోవడం : దేవునికి అడ్డుగా ఉన్న మన సొంత కోరికలను ప్రణాళికలను విడిచిపెట్టాలి. మత్తయి 16:24-26, మత్తయి 6:28-34 

విధేయత : అది కఠినంగా ఉన్నప్పటికీ. యోహాను 14:15

శ్రమలు : పేరు ప్రఖ్యాతలు కాదు. 2 తిమోతి 3:12

నమ్మకత్వం : "తప్పును సమర్ధించే", "పాపాన్ని ప్రోత్సాహించే" వారిగా మరియు "స్వార్ధప్రియులుగా" ఈ తరం సంస్కృతి ఉన్నప్పటికీ, దేవుని వాక్యానికి వీరంతా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని తెలిసినా దేవుని వాక్యాన్ని బట్టి అతిశయించడం. మార్కు 8:30

ఇవన్నీ సంపూర్ణమైన తృప్తికరమైన జీవితానికి మార్గాలు అన్నట్టు మనకు అనిపించకపోవచ్చు కాని మన యేసు ప్రభువు అవును అని మనకు భరోసా ఇస్తున్నారు !
* యోహాను 10:10



ఎవరైతే యేసు ప్రభువును యదార్ధమైన హృదయంతో ప్రేమిస్తారో వారిలో మాత్రమే ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తాయి, నామకార్ధపు క్రైస్తవులలో మాత్రం అవి కనిపించవు. ఆ నాలుగు లక్షణాలు ఏమిటో ఈ ఒక్క నిమిషంలో చదువగలిగిన వాక్యధ్యానంలో తెలుసుకుందాం !

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.