తీవ్రమైన, ఉద్దేశ్యపూర్వకమైన, హృదయపూర్వకమైన


అపోస్తులుడైన పౌలు నుండి మనం సూచనలను తీసుకోగలిగితే, నేటి సంఘాలు ఎలాగైతే సులభమైన క్రైస్తవ్యానికి అమ్ముడుపోతున్నారో అలా మనం కాకుండా జాగ్రత్తపడొచ్చు!


మనం క్రైస్తవులము అయిన తరువాత మనకు ఇంక ఏ శిక్షావిధి లేదు, కాని మనకి చాలా ముఖ్యమైన భాద్యతలు ఉన్నాయి (రోమీయులకు 8)


పౌలు తను పొందిన రక్షణలో ఎంతో సంతోషించాడు, కాని క్రీస్తును ఇంకా తెలుసుకోవడానికి "వేగిరపడుటలో" ఎప్పుడూ ఆగిపోలేదు. తన గురిని ఇంకా చేరుకోలేదని, తాను పొందవలసిన బహుమానాన్ని ఇంకా పొందలేదని పౌలుకు తెలుసు. దేవుని రాజ్యవిస్తరణ కోసం తాను ఇంకా పని చేయవలసి ఉందని కూడా పౌలుకు తెలుసు (ఫిలిప్పీయులకు 3:10-14). 


దేవుడే తన ద్వారా పనిని జరిగిస్తున్నారు, సరైన ఆశలు కోరికలు ఆయనే తనలో కలుగజేస్తున్నారు అనే వాటిల్లో పౌలుకు ఎంతమాత్రం సందేహం లేదు.. కానీ దేవుని చిత్తాలకు, పనికి తాను చురుకుగా సంపూర్తిగా లోబడటం తన ముఖ్యమైన బాధ్యత అని పౌలు తెలుసుకున్నాడు. ఆయన దేవుణ్ణి "భయముతోను మరియు ఒణుకుతోను" అంటే తీవ్రంగా, ఉద్దేశపూర్వకంగా, హృదయపూర్వకంగా.. వెంబడించాడు! (ఫిలిప్పీయులకు 2:12-13)

వీటన్నింటిలో ఎంతో ఇబ్బంది, కష్టం, ఎన్నో శ్రమలు ఉంటాయి అని పౌలుకు స్పష్టంగా తెలుసు.. "అందుకే క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు". (2 తిమోతికి 3:12) అని వ్రాయడం జరిగింది.. అయినా సరే ఇవేమి పౌలును ఆపలేదు. 

ప్రియ క్రైస్తవులారా, మనందరికీ క్రీస్తును తెలుసుకోవడం, ఇతరులకు తెలియజేయడం అనే చాలా ప్రాముఖ్యమైన, తీవ్రమైన, అద్భుతమైన, జీవితాలను మార్చివేసే లక్ష్యం ఉందని మీరు గ్రహించారా? 

క్రీస్తు ప్రేమలో మనం విశ్రాంత పొందొచ్చు, కాని మనకున్న ఈ ముఖ్య లక్ష్యం నుండి మాత్రం ఎప్పుడూ విశ్రాంత తీసుకోకూడదు !



అపోస్తులుడైన పౌలు నుండి మనం సూచనలను తీసుకోగలిగితే, నేటి సంఘాలు ఎలాగైతే సులభమైన క్రైస్తవ్యానికి అమ్ముడుపోతున్నారో అలా మనం కాకుండా జాగ్రత్తపడొచ్చు!

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.