బైబిల్ లోని దేవుడు మాత్రమే మన తండ్రిగా ఉండాలని ఆశపడే దేవుడు.
ఇతర మతాలు కూడా దేవుళ్లను చూపిస్తాయి కాని వారంతా వ్యక్తిగత సంబంధాన్ని అందించలేరు, వారిని సమీపించే వీలునూ కల్పించలేనివారు. కాని నిజమైన దేవుడు ఒక తండ్రి కూడా.
మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము. (2 కొరింథీయులకు 6:18-7:1)
పాపాన్ని విడిచి పెట్టడానికి తండ్రిలాంటి మన దేవుని ప్రేమే మనకున్న ముఖ్య ప్రేరణ.
• ఒక తండ్రిలాగా ఆయన మనలను ప్రేమిస్తారు.
• ఒక తండ్రిలాగా మనకి ఏది మంచిదో కూడా ఆయనకు బాగా తెలుసు.
పాపాన్ని విడిచిపెట్టడం వలన ఆయన కుటుంబంలో మనం స్థానాన్ని సంపాదించలేము కాని ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మాత్రేమే ఆయన పిల్లలం అవ్వగలం (ఇతర దేవుళ్ళకు బైబిల్ లోని దేవునికి దీనిలో కూడా వ్యత్యాసం ఉంది. )
ఈరోజు ఆ దేవుని ప్రేమలో విశ్రాంతి పొందుతూ, ఆయన తండ్రితత్వాన్ని స్వీకరిద్దామా !
Only Christianity


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.