పరిశుద్ధ గ్రంధంలోని ఆది పాపము

 భూమిపై చేయబడిన ఆ మొదటి పాపము ఇప్పుడు ఆధునిక క్రైస్తవులు కూడా ఆందోళనపొందే అంత ఎక్కువగా చేస్తున్నారు. ఆ ఆసక్తికరమైన విషయాన్ని ఈ వాక్యధ్యానం వివరిస్తుంది

దేవుని వాక్యమే మనలను మార్చగలుగుతుంది కాని మనం దేవుని వాక్యాన్ని మార్చలేము.


దేవుడే మన సృష్టికర్త, మన నిర్మాణకుడు. మనం దేవుని సృష్టించినవారమో లేక నిర్మాణకులమో కాదు.


కొంతమంది ఈ సత్యాన్ని మరిచిపోయి దేవుని వాక్యం లోని కొన్ని భాగాలు మనకు సంబందించినవి కాదు అని నిర్ణయించుకుంటారు. లేదంటే దేవుని లేఖనాలలోని  సత్యాన్ని, అసత్యంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. లేక దేవుడే లైంగిక సాన్నిహిత్యాన్ని సృష్టించారు కాబట్టి, స్వలింగ సంపర్కం, వివాహినికి ముందే లైంగిక సంబంధం అనే వాటిని దేవుడేమి నిషేధించరు అనికూడా వాదిస్తూ ఉంటారు.


వారి వాదన ఏదైనప్పటికీ, దేవుని వాక్యంలో లోపాలు ఉన్నాయి అని చెప్పే ఆధునిక బోధకుల సలహాలను వారు అనుమతిస్తూ ఉంటారు !


వారు ఇలా చేసినప్పుడల్లా దేవుని పరిశుద్ధ గ్రంధంలో చెప్పబడిన అదే ఆది పాపమును వారు కూడా చేస్తున్నట్టే. అది ఆది పాపములలో ఒకటి కాదు గాని ఆదిలో మొదలైన మొదటి పాపమే.


నిషేధించబడిన ఫలమును తింటే నిశ్చయంగా చచ్చెదరు అని దేవుడు నరునికి ఆజ్ఞాపించడం ఆదికాండం 2:16-17 లో చూస్తాము.


మీరు చావనే చావరు, దేవునిలాగా అయిపోతారు అని సాతాను అవ్వతో చెప్పడం ఆమె తినడం ఆదికాండం 3:4-6 లో చూస్తాము.


బహుశా అవ్వ దేవుని మాటతో ఇంక తనకు సంబంధం లేదు అని అనుకుందేమో. బహుశా ఆదాము దేవుని ఆజ్ఞను సరిగ్గా అర్ధం చేసుకోలేదు అని కూడా అనుకుందేమో. అవ్వకు ఫలాలంటే ఇష్టం అని దేవునికి తెలుసు కాబట్టి ఈ ఒక్క రకాన్నే దేవుడు ఎందుకు తినొద్దు అంటారు? అలా తను ఎలా ఆలోచించుకున్నప్పటికీ దేవుని హెచ్చరిక నిజమైనది కాదు అని చెప్పే సాతాను సలహాను తాను అనుమతించింది.


ఎలాగైతే అవ్వ యొక్క పతనం వెనకాల సాతాను ఉన్నాడో అలానే దేవుని వాక్యాన్ని ప్రశ్నించే లేక నిరాకరించే ప్రతీ యొక్క ఆధునిక బోధల వెనుక కూడా  వాడు ఖచ్చితంగా ఉన్నాడు. 

---------------------------

భూమిపై చేయబడిన ఆ మొదటి పాపము ఇప్పుడు ఆధునిక క్రైస్తవులు కూడా ఆందోళనపొందే అంత ఎక్కువగా చేస్తున్నారు. ఆ ఆసక్తికరమైన విషయాన్ని ఈ వాక్యధ్యానం వివరిస్తుంది
దేవునిపై ఆయన వాక్యంపై మన విశ్వాసాన్ని ఇంకా లోతులోనికి నడిపించుకోవడానికి ఈ క్రింది వాక్యభాగాలను తలబోసుకుందాం :

💜దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది. (2 తిమోతికి 3:16, 17)

💜ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. (హెబ్రీయులకు 4:12)

💜నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నియు నాకసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. (కీర్తనలు 119:103-105)



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.