అవ్వ సాతాను చేత మోసగింపబడి, దేవుని మాటను తృణీకరించడం, నిషేధించిన పండును తినడం అనే ఆ మొదటి పాపాన్ని చేసినట్టు మనం ఆదికాండము 3:1-6 లో చూడొచ్చు.
ఆదాము మాత్రం పూర్తి జ్ఞానంతో తాను ఏమి చేస్తున్నాడో తెలిసే ఆ నిషేధింపబడిన పండును తినడం జరిగింది. తాను మోసగింపబడలేదు. (1 తిమోతి 2:14) (1)
ఆదాము తన "తోటివారి ఒత్తిడికి" పూర్తిగా లోబడ్డాడు.
మన సంస్కృతిలో కూడా "తోటివారి ఒత్తిడి" అని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన లైంగిక అనైతికత, దైవికం కాని విందు వినోదం లేక ఇతర వాటి చేత జయింపబడే ఆధునిక క్రైస్తవులు కూడా ఇదే చేస్తున్నారు.
దానిలో మొదటి అడుగు మౌనంగా ఉండటం.
ఆదాము అదే చేసాడు. సాతాను అవ్వను మోసగిస్తుంటే చూస్తూ మౌనంగా నిలబడ్డాడు. తరువాత అవ్వ పాపంతో తాను కూడా ఏకీభవించాడు.
ఒక క్రొత్త ప్రపంచానికి అధికారిగా దేవుడు ఆదామును నియమిస్తే, ఆదాము దానినంతటిని పాడుచేసుకున్నాడు. ఎందుకంటే తాను దేవునికంటే అవ్వనే సంతోషపెట్టాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి. (ఆదికాండము 3:17-19). (2)
ప్రియమైన క్రైస్తవులారా, "అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయునిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునైయున్నారు (1 పేతురు 2:9)
కేవలం ఈ సంస్కృతిలోకి "ఇమిడిపోవాలి" అని ఉద్దేశంతో మౌనంగా నిలబడేవారంగా మనం ఉండొద్దు.
ఈ ఒక్క నిమిషంలో చదువగలిగిన వాక్యధ్యానంతో పాటుగా మీకు సహాయంగా ఉండే ఇతర వాక్యభాగాల కోసం క్రిందకురండి
-----------
(1) అవ్వ కంటే ఆదాము పాపము ఘోరమైనది (తీవ్రమైనది):
⇒మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. (1 తిమోతికి 2:14)
⇒సాతాను పండును తినమని అవ్వను ప్రేరేపిస్తున్నప్పుడు, ఆదాము అక్కడే ఉన్నట్టుగా మనకు అనిపించినా, ఆ సమయంలో దేవుని ఆజ్ఞను అవ్వకు గుర్తుచేసినట్టు గాని లేక తాను పండును తినడానికి తిరస్కరించినట్టు గాని మనకు అక్కడ కనబడదు (ఆదికాండము 3:6)
⇒ఆదాము అవ్వకు మనస్తాపం కలిగిస్తానేమో అని భయపడ్డడా లేక ఆమెను సంతోషపరచాలి అని అనుకున్నాడా అనేది మనకు తెలీదుగానీ ఆదాము మోసపరచబడలేదు అని మాత్రం లేఖనం స్పష్టంగా వివరిస్తుంది.
⇒ఆదాము కావాలనే పాపం చేసాడు కాబట్టి అవ్వ కంటే తాను చేసిన పాపం ఘోరమైనది (లూకా 12:47-48).
(2) ఆదికాండము 3:17-19: ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు; నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.
మనము ఈ క్రింది వాక్యాలను జాగ్రత్తగా చదువుతూ, ఉచ్చరిస్తూ, కంఠస్థం చేసుకుందాం :
మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి (1 కొరింథీయులకు 16:13)
కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి. (1 కొరింథీయులకు 15:58)
The Second Oldest Sin: Peer Pressure


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.