మూడవ ఆది పాపము : నువ్వు పారిపోగలవేమో గాని దాక్కోలేవు

పరిశుద్ధ గ్రంధంలోని మూడవ ఆది పాపము ఏమిటో నీకు తెలుసా? ఒక్క నిమిషంలోనే చదువగలిగిన ఈ వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.

అవ్వ దేవుని ఆజ్ఞను తిరస్కరించిన తరువాత, ఆదాము దేవునికి వ్యతిరేకంగా తోటివారి ఒత్తిడికి లొంగిపోయిన తరువాత, వారిద్దరు పరిశుద్ధ గ్రంధంలో చెప్పబడిన మూడవ ఆది పాపమును (1) చేయడం జరిగింది.. అది వారు దేవుని నుండి దాగాలని ప్రయత్నించడమే (ఆదికాండము 3:8-10)


ఆదాము అన్నాడు తాను దాక్కోవడానికి కారణం దిగంబరిగా దేవుణ్ణి ఎదుర్కోవడానికి భయమేసి అని, కాని వాస్తవానికి తాను ఎప్పుడూ కూడా దిగంబరిగానే ఉన్నాడు. పాపమే అతన్ని అలా చెట్ల మధ్యకు వెళ్లి దాక్కొనేలాగా చేసింది. (2)


పశ్చాత్తాపపడటం బదులు, ఆదాము అవ్వలు దాక్కున్నారు.


మన పాపాల్ని మనం నిర్లక్ష్యం చేసినపుడు లేదా వాటికి సాకులు చెప్పినపుడు లేదా అది సరైనదే అని నిరూపించే ప్రయత్నం చేయడం లాంటివి చేసినప్పుడు అదే పాపాన్ని మనం కూడా చేస్తున్నట్లే.


మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. (హెబ్రీయులకు 4:13)


పశ్చాత్తాపపడటం అనేది దాక్కునే మనలను బయటకు తెచ్చి దానికి కారణమైన మన పాపాలను, ఆ దిగంబరత్వాన్ని, క్షమాపణ అనే వస్త్రంచే కప్పేలా దేవునికి అవకాశం ఇవ్వడమన్నమాట. (సామెతలు  28:13, 1 యోహాను 1:9).


నీ జీవితంలో నువ్వు కూడా దేనివిషయమైన "దాక్కుంటున్నావా"? అయితే బయటకు రా!

-----------------

(1) చదవండి : పరిశుద్ధ గ్రంధంలోని ఆది పాపము

రెండవ ఆది పాపము : తోటివారి ఒత్తిడి

(2) ఆదాము అవ్వలు పాపం చేయడం వలన, వారు దిగంబరత్వం అనే దానితో సహా ప్రతీ దాన్నీ చూసే విధానం పూర్తిగా మారిపోయింది. దానికి ముందు కూడా వారు "దిగంబరులుగా ఉన్నారు కాని వారికి బిడియం (సిగ్గు) అనేదే తెలీదు" ఎందుకంటే అప్పుడు వారు పాపం లేనివారిగా నిర్దోషులుగా ఉన్నారు (ఆదికాండము 2:25). ఇతరుల దిగంబరత్వాన్ని చూసినప్పుడు ఎలాంటి దురాలోచనాలూ వారికి రాలేదు, వారి దిగంబరత్వాన్ని చూసినప్పుడు కూడా ఎలాంటి అభద్రత వారికి అనిపించలేదు. పాపం వలన వారి ఆలోచనలలో కల్మషం ప్రవేశించింది. కాని విచారకరం ఏమిటంటే ఆదాము అవ్వలు వారి పాపాన్ని గురించి ఏమాత్రం చింతించలేదు.

Third Oldest Sin: You Can Run, But You Can’t hide


పరిశుద్ధ గ్రంధంలోని మూడవ ఆది పాపము ఏమిటో నీకు తెలుసా? ఒక్క నిమిషంలోనే చదువగలిగిన ఈ వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.