పాత నిబంధనలో ఉన్న క్రీస్తు

మన యేసును గురించిన "గుసగుసలు" దేవాది దేవుడు ప్రతీ పాత నిబంధన గ్రంధ పుస్తకాలలో అంతర్భాగంగా పెట్టిన ఈ అద్భుతమైన పట్టీని చదివే అవకాశాన్ని పోగొట్టుకోవద్దు!


"ఎమ్మాయి గ్రామ త్రోవలో, యేసు పాత నిబంధన గ్రంధాన్ని ఉపయోగించి తానెవరో వివరించారు "గొప్ప భోధకుడు, గొప్ప గ్రంధాన్ని ఉపయోగించి గొప్ప విషయాలను వివరించడం ఒకసారి ఊహించండి " - వారెన్ వెయిర్సబ్


యేసు తన పునరుద్దానం తరువాత, ఎమ్మాయి గ్రామ త్రోవలో నడుస్తున్న ఇద్దరు శిష్యులను ఆయన కలుసుకున్నారు (లూకా 24:13-35). వారు యేసును గుర్తుపట్టలేదు, కాని యేసు మోషే అలానే ఇతర ప్రవక్తలు గురించి చెప్పడం మొదలుపెడుతూ, దైవ లేఖనాలు తనగురించి ఏమి వివరించాయో వారికి అర్ధమయ్యేలాగా చెప్పారు (లూకా 24:27)


యేసుక్రీస్తుని విమోచన కార్యం ప్రారంభం నుండి దేవుని యొక్క ప్రణాళికలో భాగం (ఆదికాండము 3:15). ఈ ముఖ్యమైన సత్యాన్ని గనుక మనం గుర్తించగలిగితే, పాత నిబంధన మరియు కొత్త నిబంధన గ్రంధాలను అర్ధం చేసుకోవడంలో అలానే వాటి విలువను తెలుసుకోవడంలో మెరుగుపరచబడతాము.


పాత నిబంధన గ్రంధంలోని ఒకొక్క పుస్తకంలో దేవాది దేవుడు రాబోయే యేసుక్రీస్తు కోసం మనలను సిద్దపరచే ఆ (రాబోవు వాటి ఛాయ లేక ఆధారాలు లేక సూచనలు) గుసగుసల పట్టీని చదివి ఆనందించండి.


• ఆదికాండము - యేసు క్రీస్తు స్త్రీ సంతానం
• నిర్గమకాండము - మన పాస్కా గొర్రెపిల్ల
• లేవీయకాండము - మన ప్రధాన యాజకుడు
• సంఖ్యాకాండము - మేఘ స్థంభం అగ్ని స్థంభం వలే నడిపించే వాడు
• ద్వితీయోపదేశకాండము - మోషేలాంటి ప్రవక్త
• యెహొషువ - గొప్ప జయసాలి
• న్యాయాధిపతులు - మన రక్షకుడు 
• రూతు - మనలను విడిపించగలవాడు
• సమూయేలు మొదటి , రెండవ గ్రంథము - దావీదు సంతానం
• రాజులు గ్రంథము & దినవృత్తాంతములు గ్రంథము - పరక్రమవంతుడైన రాజు
• ఎజ్రా & నెహెమ్యా - కూలిపోయిన గోడలను తిరిగి నిర్మించగలడు
• ఎస్తేరు - మన తప్పించుకునే మార్గం
• యోబు గ్రంథము - కష్ట సమయాల్లో మన నిరీక్షణ
• కీర్తనల గ్రంథము - మన గొర్రెపిల్ల మన అర్పణ
• సామెతలు & ప్రసంగి - మన జ్ఞానం
• పరమగీతము - మన ప్రేమికుడు మన వరుడు
• యెషయా గ్రంథము - మన కొరకు శ్రమపడే రక్షకుడు
• యిర్మీయా - మన నీతి చిగురు
• విలాపవాక్యములు - మన కొరకు విలాపించే ప్రవక్త
• యెహెజ్కేలు - మనలను హెచ్చరిక చేసే కావలివాడు
• దానియేలు - అగ్ని గుండంలో నాలుగో వ్యక్తి
• హొషేయ - మన నమ్మకమైన భర్త
• యోవేలు - పరిశుద్దాత్మలో బాప్తీస్మం ఇచ్చువాడు
• ఆమోసు - మన భారములు వహించువాడు
• ఓబద్యా - మనలను రక్షించే పరక్రమవంతుడు
• యోనా - పంపించేవాడు
• మీకా - సువార్తను అందించే దూత
• నహూము - నీతిమంతుల కొరకు ప్రతీకారం తీర్చుకునేవాడు 
• హబక్కూకు - ఉజ్జీవం కొరకు రోదించేవాడు
• జెఫన్యా & హగ్గయి - ఇంకొక అవకాశాన్ని ఇచ్చేవాడు
• జెకర్యా - పొడవబడిన కుమారుడు
• మలాకీ - నీతిసూర్యుడు, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం దయచేయువాడు.


నీవు బైబిల్ గ్రంధాన్ని చదువుతున్నపుడు ఎప్పుడూ ఎక్కడా రాయబడని చాలా గొప్ప కథను చదువుతున్నావని జ్ఞాపకం ఉంచుకో - ఈ కథ మానవుని క్షమించరాని పతనమును మరియు దేవాది దేవుని ఆశ్చర్యకరమైన ప్రేమను వివరిస్తుంది!

Jesus in the Old Testament

మన యేసును గురించిన "గుసగుసలు" దేవాది దేవుడు ప్రతీ పాత నిబంధన గ్రంధ పుస్తకాలలో అంతర్భాగంగా పెట్టిన ఈ అద్భుతమైన పట్టీని చదివే అవకాశాన్ని పోగొట్టుకోవద్దు!

మన యేసును గురించిన "గుసగుసలు" దేవాది దేవుడు ప్రతీ పాత నిబంధన గ్రంధ పుస్తకాలలో అంతర్భాగంగా పెట్టిన ఈ అద్భుతమైన పట్టీని చదివే అవకాశాన్ని పోగొట్టుకోవద్దు!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.