నాల్గవ ఆది పాపము : అది నీ తప్పు

 పరిశుద్ధ గ్రంధంలోని నాల్గవ ఆది పాపము ఏమిటో నీకు తెలుసా? ఒక్క నిమిషంలోనే చదువగలిగిన ఈ వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.


మానవులు చేసిన నాల్గవ ఆది పాపముగా దైవ లేఖనాలలో నమోదు చేయబడినది ఏమిటంటే ఇతరులపై నిందమోపడం (ఆదికాండము 3) (1)


ఆదాము అవ్వల పాపపు పతనానికి వారు చెప్పిన వివరణల్లో పశ్చాతాపంతో కూడిన ఒక్క మాట కూడా కనీసం మనకు కనబడదు. పాపాన్ని ఒప్పుకోని, దేవుని క్షమాపణ అడగడానికి బదులు ఆదాము అవ్వలు ఎవరో ఒకరి మీద నిందలు మోపుతూ సాకులు చెప్పే ప్రయత్నం చేసారు.


ఆదాము అవ్వ మీద నిందలు మోపి పరోక్షంగా అవ్వను ఇచ్చినందుకు దేవుణ్ణే నిందించాడు :

"అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిననెను".


అవ్వేమో సర్పంపై తప్పు మోపింది :

"సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను."


అదిగో ఆ రోజు నుంచే మానవులు ఇతరులపై తప్పు మోపడంలో నిష్ణాతులైపోయారు.


• కాని మనం సాతానుని నిందించలేము (యాకోబు 4:7)

• మనం మన తల్లిదండ్రులను నిందించలేము (యెహెఙ్కేలు 18:20)

• మనకున్న పరిస్థితులను కూడా నిందించలేము (ఫిలిప్పీయులకు 4:12-13; 1 కొరింధీయులకు 10:13).


మనం చేసిన పాపాలను బట్టి ఎవరినైనా లేక దేనినైనా నిందించడం మొదలు పెట్టాలి అని అనిపిస్తే, వెంటనే తప్పకుండ యాకోబు 1:12-15, మరిముఖ్యంగా 14-15 వచనాలను చదువుకోవాల్సిన అవసరం చాలా ఉంది.


ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. (యాకోబు 1:14,15)

-------------------

(1) దైవ లేఖనాలలో నమోదు చేయబడిన మానవుల మొదటి నాలుగు పాపాలు

➧అవ్వ దేవుని ఆజ్ఞను తిరస్కరించింది (పరిశుద్ధ గ్రంధంలోని ఆది పాపము )

➧ఆదాము తోటివారి పాపపు ఒత్తిడికి లొంగిపోయాడు (రెండవ ఆది పాపము : తోటివారి ఒత్తిడి )

➧వారిద్దరూ కూడా దేవుని నుండి దాగాలని ప్రయత్నించారు (మూడవ ఆది పాపము : నువ్వు పారిపోగలవేమో గాని దాక్కోలేవు)

➧ఇతరులపై తప్పులు లేక నిందలు మోపడం మొదలుపెట్టారు (నాల్గవ ఆది పాపము : అది నీ తప్పు) 

The Fourth oldest sin: It's your fault

పరిశుద్ధ గ్రంధంలోని నాల్గవ ఆది పాపము ఏమిటో నీకు తెలుసా? ఒక్క నిమిషంలోనే చదువగలిగిన ఈ వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.