నా నూతన సంవత్సర ప్రార్ధన

దైవగ్రంధం నుండి వాక్యలను ఆధారంగా చేసుకున్న అద్భుతమైన ప్రార్ధన. నీవు తరుచూ ఉచ్చరించాలని ఆశపడి చేసే ప్రార్ధన!

✝️ప్రభువా, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. (కీర్తనలు 119:18)

✝️ప్రభువా, నేను నీ మాటలు ఇంకా సన్నిహితంగా ఆలకించులాగున సహాయం చేయండి (సామెతలు 8:32-34)

✝️ప్రభువా, నేను వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్నవాటి కొరకై వేగిరపడేలాగ సహాయం చేయండి (ఫిలిప్పీయులకు 3:13-14)

✝️ప్రభువా, నీ ప్రేమ నా జ్ఞానమునకు మించి ఎంతో గొప్పది అని గ్రహించుటకు సహాయం చేయండి (ఎఫెస్సీయులకు 3:17-19).

✝️ప్రభువా, నా జ్ఞానమునకు మించిన నీ శాంతిని నేను అనుభవించేలాగ సహాయం చేయండి (ఫిలిప్పీయులకు 4:6-7)

✝️ప్రభువా, నేను నన్ను కాకుండా నిన్నే నమ్ముకునేలాగా సహాయం చేయండి (సామెతలు 3:5-6).

✝️ప్రభువా, నేను ఈ లోక మర్యాదను అనుసరింపక, నీ సత్యవాక్యాంచే నా మనస్సు మారి రూపంతరం చెందేలాగ సహాయం చేయండి (రోమీయులకు 12:1-2).

✝️ప్రభువా, నాకు హాని చేసే వారిని క్షమించేలాగా సహాయం చేయండి (కొలొస్సీయులకు  3:13)


✝️ప్రభువా, నా పాపములను వెంటనే ఒప్పుకునే సిద్దమనస్సు కలిగి ఉండేలాగ సహాయం చేయండి (1 యోహాను 1:9-10).

✝️ప్రభువా, నేను తప్పు చేసిన వారి దగ్గర నా పాపమును ఒప్పుకునేలాగా సహాయం చేయండి (యాకోబు 5:16)

✝️ప్రభువా, ప్రతీ రోజూ ప్రతీ నిమిషం నీ చిత్తాలను చూసేలాగా సహాయం చేయండి (ఎఫెస్సీయులకు 2:10)

✝️ప్రభువా, నీకు నా సమస్తాన్ని ఇచ్చేలాగా సహాయం చేయండి (ఫిలిప్పీయులకు 3:7-14)

ఆమేన్!

My New Year's Prayer


దైవగ్రంధం నుండి వాక్యలను ఆధారంగా చేసుకున్న అద్భుతమైన ప్రార్ధన. నీవు తరుచూ ఉచ్చరించాలని ఆశపడి చేసే ప్రార్ధన!

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.