మరచిపోవద్దు

ఈసారి క్రిస్మస్ సమయంలో, దయచేసి వీరిని జ్ఞాపకం చేసుకోండి.. వీరి కోసం ప్రార్ధించండి!

పోయిన సంవత్సరం మన సహోదరీ సహోదరులలో ఏడుమంది కోళ్లఫారంలో చేతులు కాళ్ళు కట్టేయబడి అక్కడ అలా క్రిస్మస్ చేసుకున్నారు.. ఇరువై రోజులు ఆ కోళ్లఫారంలో అలానే ఉండిపోయారు!


ఎందుకు? ఎందుకంటే వారు లేయోస్ అనే ప్రాంతంలో చట్ట వ్యతిరేకమైన కార్యం చేసారు కాబట్టి.. అదేమిటంటే క్రీస్తు పుట్టుకను వారంతా కలిసి పండుగగా జరుపుకుంటున్నారు కనుక. అలా చేస్తున్నారని పోలీసులు వారిని అరెస్టు చేసారు.


దాని తరువాత ఇరువై రోజులు, వారు సంతోషభరితమైన క్రీస్తు పుట్టుక బదులు క్రీస్తు పొందిన హింసలను పండుగగా జరుపుకున్నారు.


"అరవై దేశాలలో ఉండే క్రైస్తవులకు, హింసలు (లేదా శ్రమలు) మరియు క్రిస్మస్ తరుచూ కలిసిమెలిసి ఉన్నట్టే ఉంటుంది" అని ఓపెన్ డోర్స్ అనే సేవ సంస్థ ఇచ్చిన నివేదిక.


మీలో ఇది చదివే వారిలో చాలా మంది స్నేహితులతోనో లేక కుటుంబంతోనో కలిసి సౌకర్యావంతమైన గృహాల్లో ఉండి ప్రత్యేకమైన ఆహరంతో ఖరీదైన బహుమతులతో క్రిస్మస్ ను జరుపుకుంటారు.


మనకు ఉన్న ఆశీర్వాదములను బట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదు కానీ.. మనకంటే దయనీయమైన స్థితిలో ఉన్నవారిని మాత్రం మనం మర్చిపోకూడదు ముఖ్యంగా అన్ని నామములకన్నా పై నామం కలిగిన ఆయన కోసం శ్రమలు హింసలు పొందేవారిని అస్సలు మర్చిపోకూడదు (మత్తయి 25:34-40)


వారు మన సహోదరీ సహోదరులే. ఈ సంవత్సరం వారికి ఏ రకంగా సహాయం అందిద్దాం? ఈసారి క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నపుడు, అలా దేవుని కోసం  హింసింపబడుతున్న వారి కొరకు ప్రార్ధించడానికి కొంచెం సమయం కేటాయించుదాం!

Don't Forget


ఈసారి క్రిస్మస్ సమయంలో, దయచేసి వీరిని జ్ఞాపకం చేసుకోండి.. వీరి కోసం ప్రార్ధించండి!

ఈసారి క్రిస్మస్ సమయంలో, దయచేసి వీరిని జ్ఞాపకం చేసుకోండి.. వీరి కోసం ప్రార్ధించండి!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.