ఎవరు యోగ్యులు?

కృపను గురించి తప్పుగా అర్ధం చేసుకోవడం సులభమే అయినప్పటికీ, ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవడం చాలా ప్రాముఖ్యమైనది.


"
నువ్వు యోగ్యుడవు" ఒక సంఘ కాపరి తన సంఘ సభ్యులతో చెప్తున్నాడు. "నువ్వు యోగ్యుడవు కాకపోతే యేసు క్రీస్తు నీ కొరకు చనిపోయేవాడు కాదు" అని.


ఈ అపోహ అందరిలో ఉండడం ఈరోజుల్లో సాధారణమైపోయింది.


కాని మనం ఒకటి అర్ధం చేసుకోవాలి : "మనం విలువైనవారమని దేవుడు మనలను ప్రేమించడంలేదు. కాని దేవుని ప్రేమే మనకు విలువనిస్తుంది అని" ఫుల్టన్ జాన్ షీన్.


"గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు... "(రోమీయులకు 3:11)


"అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి...." (రోమీయులకు 3:12)


"ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు." (రోమీయులకు 3:23,24)


"కాబట్టి అతిశయకారణ మెక్కడ? అది కొట్టి వేయబడెను... (రోమీయులకు 3:27)


"యేసు క్రీస్తు యొక్క సిలువ త్యాగానికి మనం ఏ రకంగానూ యోగ్యులం కాము" అనే విషయం గుర్తుపెట్టుకోవడం చాలా కీలకమైనది.


దేవుని యొక్క ఉన్నతమైన కృపకు మనం ఎంత అనర్హులమో, ఆ కృప ఎంత అద్భుతమైనదో, ఎంత మధురమైనదో, ఎంత ఆశ్చర్యకరమైనదో, ఎంత సహసవంతమైనదో మనం అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికీ తీరనిది.


ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి(ప్రకటన 4:11).


-------------


రోమీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని 11 నుండి 27 వచనముల వరకు దయచేసి చదివి ధ్యానించమని నా మనవి.


Who's Worthy?


కృపను గురించి తప్పుగా అర్ధం చేసుకోవడం సులభమే అయినప్పటికీ, ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవడం చాలా ప్రాముఖ్యమైనది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.