సామెతల గ్రంధం నుండి స్నేహం గురించిన తెలివైన సలహాలు

ఈరోజు వాక్యధ్యానం సామెతల గ్రంధం నుండి స్నేహం గురించిన తెలివైన సలహాలనిస్తుంది: 8 రకాల మనుషులతో స్నేహం చేయకూడదు, 4 రకాల మనుషులతో స్నేహం చేయవచ్చు!


స్నేహితులను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని సామెతల గ్రంధం మనలను హెచ్చరిస్తుంది (సామెతలు 12:26)


ఎలాంటి వారితో స్నేహం చేయకూడదు :

1. ఎవరైతే ధనాన్ని అన్యాయంగా సంపాదిస్తారో : సామెతలు 1:10-19

2. ఎవరైతే చెడు జరిగిస్తారో : సామెతలు 4:14-19

3. ఎవరైతే తక్కువ నైతిక విలువలు కలిగి ఉంటారో : సామెతలు 5 & 29:3

4. ఎవరైతే మూర్ఖులుగా ఉంటారో : సామెతలు 13:20

5. ఎవరైతే బలాత్కారులుగా ఉంటారో : సామెతలు 16:29

6. ఎవరైతే ధనానికి, పేరుకు, అధికారానికి ఆకర్షితులవుతారో : సామెతలు 19:4,6-7

7. ఎవరైతే క్రోధముగలవారో : సామెతలు 22:24-25

8. ఎవరికైతే ఆశా-నిగ్రహం లేదో : సామెతలు 25:28 & 28:7

నూతన నిబంధన దీనంతటి సారాంశాన్ని ఈ
ఒక్క వచనం ద్వారా తెలుపుతుంది :
"మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును". (1 కొరింథీయులకు 15:33)

మంచి స్నేహితులు :

1. నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే మంచి సలహాలు ఇస్తారు: సామెతలు 27:6,9

2. క్షమిస్తారు కాని జరిగిన తప్పును మాటిమాటికి ఎత్తరు: సామెతలు 17:9

3. సంతోషంలోను, దుర్థశలోను నీతోనే ఉంటారు : సామెతలు 17:17

4. వారు మాత్రమే నిన్ను 'సరిచేయడం, పదునుపెట్టడం' కాదు గాని నీవు కూడా వారిని 'సరిచేయడానికి, పదునుపెట్టడానికి' అంగీకరిస్తారు : సామెతలు 27:17

మనకు ఎలాంటి స్నేహితులు అవసరమో, మనం ఎలాంటి స్నేహితులుగా ఉండాలో కొలస్సీయులకు 3:12-14 చాలా చక్కగా వివరించబడింది.


ఈరోజు వాక్యధ్యానం సామెతల గ్రంధం నుండి స్నేహం గురించిన తెలివైన సలహాలనిస్తుంది: 8 రకాల మనుషులతో స్నేహం చేయకూడదు, 4 రకాల మనుషులతో స్నేహం చేయవచ్చు!



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.