కష్టం లేనిదే, ఫలితం లేదు - హెబ్రీయులకు 12

జీవితంలోని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు హెబ్రీయులకు 12 వ అధ్యాయం ద్వారా ఎంతో ప్రోత్సాహాన్ని పొందొచ్చు. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.


హెబ్రీయులకు 12 వ అధ్యాయానికి "కష్టం లేనిదే ఫలితం లేదు" అనే పేరు పెట్టొచ్చేమో.


కష్టం (లేక బాధ) అనేది మన ఆత్మీయ ఎదుగుదలకు ఒక సాధనం అని ఈ అధ్యాయం చెబుతుంది.


అందుకే మనం  :


1. కష్టాలను ఒక శిక్షణగా లేక సాధనగా చూడాలి గాని ఒక వ్యర్ధమైన బాధగా చూడకూడదు. "శిక్షణగా భావించి కష్టాలను సహించు".

శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. (హెబ్రీయులకు 12:7,11)


2. నువ్వు సహించగలవు అని నమ్ము.
మనకంటే ముందు ప్రయాణించి, జయాన్ని పొందిన "గొప్ప సాక్షి సమూహము" మేఘమువలె మనలను ఆవరించియున్నది (హెబ్రీయులకు 12:1)


3. నీ గురి కష్టం పై కాక క్రీస్తుపై మాత్రమే ఉండేలాగా జాగ్రత్తపడు.
మీరు అలసటపడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు సాగిపోవాలి.(హెబ్రీయులకు 12:2,3)


4. దేవుడే పరిపూర్ణుడైన తండ్రి అని గుర్తుపెట్టుకో.
ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. (హెబ్రీయులకు 12:6)


బహుశా హెబ్రీయులకు 12 వ అధ్యాయానికి "కష్టాన్ని పెట్టుబడిగా పెట్టు, లాభాన్ని హామీగా పొందు"  (హెబ్రీయులకు 12:11) అనే పేరు ఇంకా బాగుంటుందేమో. నువ్వు ఏమనుకుంటున్నావ్ ?

---------------------------


*క్రమశిక్షణలో నిర్మాణాత్మకమైన శిక్ష కూడా ఒక భాగం కావొచ్చు లేక శిక్ష లేని తర్ఫీదు కావొచ్చు. కాబట్టి ఈ వాక్యభాగం మన జీవితంలో దేవుడు అనుమతించే అన్ని కష్టాలకు వర్తిస్తుంది.


No Pain, No Gain - Hebrews 12


జీవితంలోని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు హెబ్రీయులకు 12 వ అధ్యాయం ద్వారా ఎంతో ప్రోత్సాహాన్ని పొందొచ్చు. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.