వాస్తవాలు లేక అనుభూతులు


యెషయా 57:15 ప్రకారం దేవుడు రెండు స్థలాలలో జీవించడానికి ఇష్టపడతాడు. ఈ అద్భుతమైన, ఆశ్చర్యపరిచే, స్వపరీక్ష చేసుకోగలిగే వాక్యభాగాన్ని ఈరోజు ధ్యానంలో చూద్దాం!


నిపుణుల ప్రకారం ఎవరైతే తప్పు చేసామని ఒప్పుకోరో వాళ్ళు సిగ్గు, భాద్యత, హాని, చెడు అనే అనుభూతులను భరించలేరంట. వాళ్ళు ఎప్పుడూ తమ గురించి తాము మంచిగానే భావించుకోవడం అనేది వారికి ఎంతో ఇష్టమైన అనుభూతి అంట.


కనుక మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం : మనం దేనిపైన ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాము? అనుభూతులపైనా లేక వాస్తవాలపైనా ?


ఎవ్వరికీ వారు చెడ్డవారని, సిగ్గుపడాల్సినవారని, హానికరమైనవారని, భాద్యత తీసుకోవాల్సినవారని, గుర్తించడం ఇష్టం ఉండదు. కాని చాలాసార్లు మనం అలాంటివారమే.


మనది 10% తప్పు ఎదుటి వారిది 90% తప్పు అయినా సరే దేవుడు మనం పశ్చాత్తాపపడాలని ఆశిస్తాడు. ఎందుకంటే పాశ్చాత్తాపం వలనే దేవునితో మనం అన్యోన్య సంబంధంలో కొనసాగగలం, అలానే ఆయనలో మనం నమ్మకం, నిరీక్షణ తిరిగి పొందగలం.


దేవుడు అంటున్నాడు, "నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించువాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను". (యెషయా 57:15)


పాశ్చాత్తాపం పడని వారు ఆనందంగా ఉన్నాము అని అనుకోవచ్చు, ఎందుకంటే వారిచేత వారే మోసపోయారు కాబట్టి.


యాదార్థమైన పాశ్చాత్తాపం సేదదీరుస్తుంది, పునరుద్ధరిస్తుంది, మనలో మార్పును తెస్తుంది. అది క్రీస్తు ప్రేమికులకు వాస్తవమైన ఆనందాన్ని, సంతోషాన్ని తెస్తుంది, అంతమాత్రమే కాక "దేవుడు నివసించు స్థలానికి" మనలను నడిపిస్తుంది.


Facts or Feelings


యెషయా 57:15 ప్రకారం దేవుడు రెండు స్థలాలలో జీవించడానికి ఇష్టపడతాడు. ఈ అద్భుతమైన, ఆశ్చర్యపరిచే, స్వపరీక్ష చేసుకోగలిగే వాక్యభాగాన్ని ఈరోజు ధ్యానంలో చూద్దాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.