యేసును అందరూ ఇష్టపడేవారా?

చాలా మంది యేసు యొక్క వ్యక్తిత్వాన్ని, ఈలోకంలో పరిచర్య చేసినప్పుడు ఆయన్ని అంగీకరించిన విధానాన్ని పూర్తిగా అపార్ధం చేసుకుంటున్నారు. ఈరోజు వాక్యధ్యానంలో యేసు పలికిన ఒక వచనం ద్వారా ఆయన్ని సరిగ్గా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం!


"వారు యేసును ఇష్టపడ్డారు కాని క్రైస్తవ సంఘాన్ని కాదు" అనే పుస్తకాన్ని కొన్ని సంవత్సరాల క్రితం నేను చదివాను. *క్రైస్తవులు, వారి వికృతమైన వ్యాఖ్యల వలన, మొరటు వైఖరి వలన సువార్తను వికారంగా అందిస్తారు అనే సరైన విషయాలనే అందులో వ్రాసారు.


కాని ఈ పుస్తకంలో వారు చూపిన ప్రాముఖ్యమైన వాదనలో లోపము ఉంది. వారి అభిప్రాయం ఏమిటంటే మనం యేసులాగ ప్రవర్తిస్తే మనుషులు మనలను ఎక్కువ ఇష్టపడతారు అని.


కాని అది వాక్యానుశారమైనది కాదు.


మనం సత్యాన్ని ప్రేమతో చెప్పే ప్రయత్నమే  చెయ్యాలి. అలా చెప్పినా సరే మన సంస్కృతి దానిని అంగీకరించదు, పాపంలో ఉన్నవారూ అంగీకరించరు. ఒకవేళ సులభంగా అంగీకరించారు అంటే మనం క్రీస్తు జతపనివారముగా ఉండే విషయంలో ఎక్కడో ఆగిపోయాం అనమాట.


యేసు క్రీస్తు మనుషులకు కోపం తెప్పించారు.. ఎంత కోపమంటే, ఆయన్ని చంపే అంత.


స్వనీతిని ఆధారంగా చేసుకున్న మతపరమైన భక్తిపరులు మాత్రమే కాదు.. పాపానికి దేవుడు చెప్పే నిర్వచనం అంగీకరించడానికి ఇష్టపడని ప్రతీ ఒక్కరూ ఆయన్ని ద్వేషించారు (యోహాను 7:7). దేవుని వాక్యంలో వ్రాయబడిన నిజమైన క్రీస్తులా మనం ఉండాలి అనుకుంటే, ఈ లోకం మనలను కూడా తప్పకుండ ద్వేషిస్తుంది (1 యోహాను 3:13).



మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించినవాడు రక్షంపబడును. (మత్తయి 10:22)


-----------------


* వారు క్రీస్తును ఇష్టపడితే, దానికి అసలైన కారణం ఏమిటంటే వారు లేఖనాలలో ఉన్న క్రీస్తును కాక "వేరే క్రీస్తును" ఇష్టపడుతున్నారని అర్ధం.


Was Jesus Likable?


చాలా మంది యేసు యొక్క వ్యక్తిత్వాన్ని, ఈలోకంలో పరిచర్య చేసినప్పుడు ఆయన్ని అంగీకరించిన విధానాన్ని పూర్తిగా అపార్ధం చేసుకుంటున్నారు. ఈరోజు వాక్యధ్యానంలో యేసు పలికిన ఒక వచనం ద్వారా ఆయన్ని సరిగ్గా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.