మనం అంద్రెయ గురించి చాలా అరుదుగా మాట్లాడుకుంటాం. తన అన్న అయిన సీమోను పేతురు వల్ల అతను మరుగున పడిపోయాడు.
కాని యేసుని మొదట నమ్ముకున్న శిష్యుడు అంద్రెయ. తానే పేతురును యేసు వద్దకు నడిపించాడు. సువార్త నిమిత్తం పేతురు చేసిన ప్రతీ పనికి తెరవెనుక ఉండి అదంతా జరిగేలా తన పరిచర్యను అందించాడు. పేతురే అంద్రెయకు రుణపడి ఉన్నాడు. (యోహాను 1:40).
అంద్రెయ యోహాను 6:1-13 లో కూడా తెరవెనుక ఉండి, యేసు అయిదు వేలమందికి ఆహారం పెట్టడం గురించి అడిగినపుడు తన విశ్వాసాన్ని కనుపరచాడు.
అంద్రెయ 'తనకు అనిపించింది' చెప్పాడు. అది సరిపోయేదికాదేమో అని అనుకున్నా కూడా, తనకు అనిపించిన ఆ చిన్నవాని యొద్ద ఉన్న అయిదు రొట్టెలు, రెండు చేపలు గురించి చెప్పేసాడు. ఆ అయిదు రొట్టెలు, రెండు చేపలే అయిదు వేలకు ఆహారంగా ఉపయోగపడి, అద్భుతములను చేసే మన దేవుని మహిమకు దోహదపడ్డాయి.
నీవు కూడా ఇలా తెరవెనుక ఉండే పరిచర్యను చేయాలని ఇష్టపడుతున్నావా? ఎవరికి తెలుసు, నువ్వు కూడా ఒక 'పేతురుకు' సువార్త ప్రకటిస్తావేమో లేక ఇతరుల జీవితాలలో గొప్ప అద్భుతాలు జరగటానికి నీ ప్రోత్సాహం కారణం కావొచ్చేమో.
అందరూ 'పేతురులు' కాలేరు గాని, ప్రతీ ఒక్కరూ అంద్రెయలు కాగలరు (ఎఫెస్సీయులకు 2:10).
Andrew - A Behind-the-Scenes Christian
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.