లొంగిపోవడం విజయానికి దారితీస్తుంది


మన జీవితంలో ఈ ముఖ్యమైన సిద్ధాంతాన్ని పాటించకపోతే క్రీస్తు యొక్క శిష్యులుగా ఉండటం అసాధ్యం. అదేమిటో నీకు తెలుసా?


గలతీయులకు 2:20 లో చెప్పబడిన సారాంశం నీకు అర్థమైందా?


నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను. (గలతీయులకు 2:20)


క్రీస్తుకు పూర్తిగా లోబడిన స్థితిని ఈ వాక్యం వివరిస్తుంది.


'లొంగిపోవుట' అనే పదం సైనికులకు సంబంధించినది.. కాని క్రైస్తవులు శత్రువులకు లొంగిపోకూడదు. శత్రువును వెంబడించడం మాని, క్రీస్తును వెంబడించడం మొదలుపెట్టాలి (ఎఫెస్సీయులకు 2:1-2)


మనం లొంగిపోవుట అనేది యేసు వద్దకు వచ్చినపుడు మొదలవుతుంది కాని అక్కడే ఆగిపోయేది కాదు.


ఇది జీవితకాలామంతా సమర్పించుకునే ప్రక్రియ, దేవుని చిత్తాలకు, జ్ఞానానికి ఎప్పటికప్పుడు విధేయత చూపాలి. కొన్నిసార్లు ఇంక నేను పూర్తిగా సమర్పించేసుకున్నాను అని మనం అనుకోవచ్చు కాని మనం 'ఆ ప్రాచీన పురుషుడుని' ఏ ఏ విషయాల్లో ఇంకా గట్టిగా పట్టుకొని ఉన్నామో దానిని పరిశుద్దాత్ముడు మరలా మనకు తెలియచేస్తాడు (ఎఫెస్సీయులకు 4:22-24)


అందుకే మన ప్రభువు అన్నారు 'ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను. (లూకా 9:23)


పూర్తిగా ఆయనకు లొంగిపోయి జీవించుట వలన గొప్ప శాంతిని, విశ్రాంతిని, మరియు మన దేవునిలోనే గొప్ప తృప్తిని పొందే ధన్యత పొందుతామని మర్చిపోవద్దు!


When Surrender Leads to Victory


మన జీవితంలో ఈ ముఖ్యమైన సిద్ధాంతాన్ని పాటించకపోతే క్రీస్తు యొక్క శిష్యులుగా ఉండటం అసాధ్యం. అదేమిటో నీకు తెలుసా?


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.