యేసుతో సమీపంగా

 క్రైస్తవుని ఎదుగుదలకు అవసరమైన చాలా ముఖ్యమైన అంశాన్ని ఒక్క-నిమిషంలోనే చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం ద్వారా తెలుసుకుందాం!


మన జీవితాలను ఎప్పుడైతే క్రీస్తుకు అప్పగించుకుంటామో, అప్పుడే మనము దేవుని పిల్లలము అయిపోతాము.


నిత్యత్వం గురించి మనం పూర్తిగా ఎరిగినవారం కాము.. తెలియనివి చాలా ఉన్నాయి (1 కొరింథీయులకు 13:12). కాని అప్పుడు అంతా పరిపూర్ణమైనదిగా ఉంటుందని, మనము కూడా పరిపూర్ణలముగా ఉంటామని మాత్రం మనకు తెలుసు (ఫిలిప్పీయులకు 3:20-21).


కాని నీకు తెలుసా మనం ఎలా పరిపూర్ణలం అవుతామో?


క్రీస్తును సరిగ్గా చూడడం వలనే!


మన రక్షకుని ముఖాన్ని ఎపుడైతే చూస్తామో అప్పటికప్పుడే మనం మార్పు చెందుతాం ఎందుకంటే ఆయన ఎలా ఉంటారో అలానే ఆయన్ని చూస్తాం కనుక.


ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము. (1 యోహాను 3:2)


యేసులాగా మార్పు చెందుట అనేది ఇప్పుడే ఇక్కడే మొదలవుతుంది (2 కొరింథీయులకు 3:18). అదే జీవితంలో మన ప్రాముఖ్యమైన లక్ష్యం అయి ఉండాలి (ఫిలిప్పీయులకు 3:10)


దేవుని గురించి ఇప్పుడు మనకున్న జ్ఞానానికి, ఇప్పటికి మాత్రమే కాదు, నిత్యత్వంలోనికి కూడా ఎంతో విలువ ఉంది.. (1 తిమోతి 4:8).


కాబట్టి యేసును వక్రీకరించి చూసే ప్రయత్నాలను తృణీకరిద్దాం (2 కొరింథీయులకు 11:14). ఆయన వాక్యంలో ఆయన నిజంగా ఏమైయున్నాడని చెప్పబడిందో అలానే ఆయన్ని తెలుసుకోవడానికి ఇష్టపడదాం.


Drawing Closer to Jesus


క్రైస్తవుని ఎదుగుదలకు అవసరమైన చాలా ముఖ్యమైన అంశాన్ని ఒక్క-నిమిషంలోనే చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం ద్వారా తెలుసుకుందాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.