ప్రేమించడం, ఆనందించడం

ఈరోజు వాక్యధ్యానం నీ జీవితభాగస్వామియందు ఆనందించడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని సలహాలను అందిస్తుంది. ప్రేమించడంతో పాటు ఆనందించడం కూడా తోడైతే అది ఎంతో అద్భుతంగా సంబంధంగా ఉంటుంది!


నీ భర్తయందు నీవు ఆనందిస్తున్నావా? ఆయన్ని ప్రేమిస్తున్నావా అని నేను అడగట్లేదు. నీవు ఆయనయందు ఆనందిస్తున్నావా అని అడుగుతున్నాను.


వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉందని నీకు తెలుసా. ఒక వ్యక్తి యందు ఆనందించకుండా కూడా ప్రేమించొచ్చు. కాని ప్రేమతో పాటు ఆనందించడం కూడా తోడైతే ఆ బంధం ఇంకా మధురమైనదిగా ఉంటుంది.


ఎందుకని అనేకమంది జంటలు ఇదివరకు వారి మధ్య ఉన్న ఆనందాన్ని పోగొట్టుకొంటున్నారు?


1. తీవ్రమైన కోపం ఒక కారణం.


ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. (కొలొస్సయులకు 3:13)


💜 ఈరోజే కొంచెం సమయం తీసుకోని ఆ వ్యక్తి గురించిన ఏమైనా పాత చేదు గాయాలు ఉంటే వాటి గురించి ప్రార్ధించి, పూర్తిగా అతన్ని క్షమించడానికి దేవుని సహాయం అడుగు.


2. తన భర్తయందు ఆనందాన్ని పోగొట్టుకోవడానికి ఇంకో కారణం ఆనందించడాన్నే విడిచిపెట్టేయడం.


3. ఇంకో కారణం ఆ జంటలు ఒకరినొకరు ప్రోత్సాహించుకునే బదులు ఎప్పుడూ విమర్శించే దృష్టి కలిగి ఉండడం.


ఈ విమర్శించే వైఖరి వారి జీవితానికి సంబంధించిన అన్నింటిలోకి వ్యాపించేసి, వారిని మర్యాదలేని, ప్రేమలేని వారిలాగా మార్చేస్తుంది.


కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. (1 థెస్సలొనీకయులకు 5:11)


వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి. (ఎఫెసీయులకు 4:29)


💜 నువ్వు నీ భర్తను (లేక భార్యను)  యదార్ధంగా ఎప్పుడు మెచ్చుకున్నావు? 'ప్లీజ్, థాంక్యూ' పదాలు ఎంత తరచూ మీరు ఉపయోగించుకుంటారు?


నీ భర్త నీ యందు ఆనందించాలి అనే కోరిక నీకు ఉంటే, ఇప్పటినుంచే నువ్వు అతని యందు ఆనందించడం మొదలుపెట్టు.. అది నీకు త్వరగా తిరిగి రావడం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు.


నీ భర్త గురించి నీ హృదయానికి ఇంకా వ్యతిరేకంగానే అనిపిస్తూ, అతనియందు ఆనందించడం నీకు కష్టంగా అనిపిస్తే, ఇది ప్రయత్నించు :


అతనిలో ఉన్న మంచి లక్షణాలన్ని ఒకచోట వ్రాసుకో, నీ దృష్టి అతని బలహీనతలపై నుండి అతని బలాలపై స్థిరపడే వరకు ఆ లిస్ట్ ని రోజూ తప్పనిసరిగా చదువుకో (ఫిలిప్పీయులకు 4:8).


దేవుడు మనయందు ఆనందిస్తున్నాడు, మనం కూడా ఒకరియందు ఒకరు ఆనందించాలని ఆయన కోరిక (జెఫన్య 3:17)


Loved and Enjoyed


ఈరోజు వాక్యధ్యానం నీ జీవితభాగస్వామియందు ఆనందించడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని సలహాలను అందిస్తుంది. ప్రేమించడంతో పాటు ఆనందించడం కూడా తోడైతే అది ఎంతో అద్భుతంగా సంబంధంగా ఉంటుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.