ఆలోచనలను ఆరోగ్యకరముగా ఉంచుకోవడానికి రెండు మార్గాలు

ఈరోజు వాక్యధ్యానంలో ఆరోగ్యకరమైన ఆలోచనా-జీవితాన్ని కలిగి ఉండటానికి దేవుని వాక్యం నుండి రెండు ముఖ్యమైన సూత్రాలను నేర్చుకుందామా!


ప్రతిఒక్కరికి రకరకాల బలాలు బలహీనతలు ఉంటాయి, మనలో చాలామందికి మరిముఖ్యంగా  "ఆలోచనలను చెరపట్టడం" అంటే అది ఒక అతి పెద్ద సవాలు (2 కొరింధీయులకు 10:3-6).


నేనైతే మరీ ఎక్కువగా ఆలోచించేసి నన్ను నేనే పాడుచేసుకోగలను. కొందరైతే అసలు ఏ ఆలోచన లేకుండా బాధ్యతారాహిత్యంగానూ ఉండగలరు.


1. ఏవి యోగ్యకరమైనవో వాటి మీదే  ధ్యానముంచుకొవాలి (ఫిలిప్పీయులకు 4:8-9)


యోగ్యమైనవి ఆలోచించడం చెయ్యలేకపోతే?  అప్పుడే మనం అలాంటివి వెతికి మరీ వాటిపై దృష్టి నిలపాలి. మనజీవితం ఎంత కఠినంగా ఉన్నాగాని ఈ కిందివాటిపై మనం దృష్టి నిలుపవచ్చు.


A.  క్రీస్తులో మనకున్న రక్షణ (రోమీయులకు 6:23)

B. ఏదో ఒక రోజున మనకున్న కష్టాలు సమాప్తం అవుతాయి అనే సత్యం (ప్రకటన 21:4)

C.  దేవుని వాక్యం మరియు పాటలు ద్వారా నిరీక్షణని , శక్తిని పొందుకోవటం  (కొలొస్సీయులకు 3:16).


2. హృదయమును భద్రముగా కాపాడుకోవడం (సామెతలు 4:23).


A. వినోదం (టి. వి, సినిమాలు,  మొదలైనవి. చెడు ప్రభావాలు) (కీర్తనలు 101:3)

B. సంగీతం (ఎఫెసీయులకు 5:18-20).

C. సంబంధాలు -  సరైన సన్నిహితులను ఎంపిక చేసుకోవడం. (1కొరింధీయులకు 15:33).

D. యోగ్యకరంగా ఆలోచించడానికి సరిపడా నిద్ర మరియు సరైన పోషణ కూడా ఎంతో సహాయపడతాయి.


మన జీవితాన్ని సరిచేసుకోవడానికి మనం సేవిస్తున్న మన అద్భుతమైన దేవుడు, ఆచరించగలిగిన ఈ మార్గాలను మనకి దయచేసినందుకు నేనెంతో కృతజ్ఞురాలిని!


2 Ways to Maintain Healthy Thinking


ఈరోజు వాక్యధ్యానంలో ఆరోగ్యకరమైన ఆలోచనా-జీవితాన్ని కలిగి ఉండటానికి దేవుని వాక్యం నుండి రెండు ముఖ్యమైన సూత్రాలను నేర్చుకుందామా!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.