గుడారపు-జీవితం

దేవుని వాక్యం క్రైస్తవులను గుడారాలతో పోల్చారని నీకు తెలుసా? ఇది చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతం.


'మనం గుడారాలం' అని అసలు మనం మర్చిపోతూ ఉంటాం.


కాబట్టి అరణ్యం అనే ఈ ప్రపంచంలో పునాదులు నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తుంటాం.


అందుకే దేవుడు ముందే మనలను హెచ్చరించాడు : కనుక యూదులు అరణ్యంలో ఉన్నపుడు, వారు దేవునికి ఒక గుడారాన్ని కట్టారు. అప్పటికి వారింకా వాగ్దాన దేశానికి చేరలేదు.


మనము కూడా ఇంకా చేరలేదు.


భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము. (2 కొరింథీయులకు 5:1)


మనకు అర్ధంకాని శ్రమలను, అయోమయాన్ని, అన్యాయాన్ని, నిరుత్సాహలను, 'గుడారపు జీవితపు' బాధలను విశ్వాసమును బట్టే ఎదురుకుంటాం.


అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను..... గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.  ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను. (హెబ్రీయులకు 11:8-10)


ప్రియమైన క్రైస్తవులారా, మనం గుడారాలమే, ఇంకా మన ఇంటికి చేరలేదు. మనం ఎదురుచూసే  శాశ్వతమైన పునాదులు కలిగిన, బాధ, అయోమయం లేని ఆ వాగ్దాన దేశమే మన ఇల్లు.


Tent-Life


దేవుని వాక్యం క్రైస్తవులను గుడారాలతో పోల్చారని నీకు తెలుసా? ఇది చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతం.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.