రూపాంతరం పొందటమా లేక లోక మర్యాదను అనుసరించడమా?


కొందరు క్రైస్తవులు పరిపక్వత పొందుతారు, కొందరు పొందరు. ఈరోజు వాక్యధ్యానం దానికి కారణాన్ని చూపి, క్రీస్తులో జీవితాన్ని పరీక్షించుకోవడానికి ఆహ్వానిస్తుంది!


నేను క్రొత్తగా జన్మించినప్పుడు, గొప్ప మార్పు నాలో కట్టలు తెంచుకోని ప్రవహించినట్టుగా అనిపించింది. నా బైబిల్ని, ఇతర క్రైస్తవ పుస్తకాలను చీల్చుకోని తినినట్టు చదివేదాన్ని, క్రైస్తవ హిత బోధను, క్రైస్తవుల సహవాసాన్ని ఆపేక్షించడం, కలిసి ఆరాధించడంలో ఎంతో ఆసక్తిని కలిగివుండేదాన్ని.


చాలా మంది నూతన విశ్వాసులు వారి కోరికల విషయంలో, లోకాన్ని చూసే విధానంలో ఇలాంటి తీవ్రమైన మార్పును అనుభవిస్తారు. కాని కాలం గడిచేకొద్దీ ఈ తీవ్రత క్షేణించిపోతుంది.


"క్రైస్తవులలో కొందరు పరిపక్వత పొందితే కొందరు పొందరు, ఎందుకని" అని ఎప్పుడైనా ఆలోచించావా?


మనలను మనం 'సజీవ యాగాలుగా' చూసుకోవడం, దేవుడు మన మనస్సులను మార్చడానికి ఒప్పుకోవడం వల్లనే మనలో ఆ ఎదుగుదల కలుగుతుందని రోమీయులకు 12:1,2 చెబుతుంది.

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.


మన ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరీక్షించుకొని అంచనా వేసుకోవడం చాలా మంచిది :


~మన జీవితాలు ఇంకా దేవుని బలిపీఠం పైనే ఉన్నాయా?


~దేవుని వాక్యం యొక్క ప్రభావంతో ఎప్పటికప్పుడు మన మనస్సులు మార్చుకుంటున్నామా?


పాలు తాగే పాపాయిల్లాగ ఉండేందుకు నిరాకరిస్తూ, సువార్త యొక్క బలమైన ఆహారాన్ని ఆపేక్షిస్తూ ఉన్నప్పుడే మన విశ్వాసంలో ఎదగగలం. (హెబ్రీయులకు 5:11-14)


Transformed or Conformed?

కొందరు క్రైస్తవులు పరిపక్వత పొందుతారు, కొందరు పొందరు. ఈరోజు వాక్యధ్యానం దానికి కారణాన్ని చూపి, క్రీస్తులో జీవితాన్ని పరీక్షించుకోవడానికి ఆహ్వానిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.