నిజంగా యేసు ప్రభువు యోనా గురించి ఇలా చెప్పారా?

యేసు ప్రభువు తన మరణం పునరుద్దానం గురించి ఒక సూచనగా యోనాను ఎందుకు ఉపయోగించారో ఒక్క నిమిషంలోనే చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానంలో చూద్దాం!

ఆయన ఇట్లనెను, "వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు." (1)


దేవుడు ఉన్నాడు అని చెప్పే ఒకేఒక్క రుజువు కేవలం యోనా ఒక్కడే అని ఈ మాటల భావమా?


కాదు. యేసు ఒక పోలికగా ఇక్కడ వాడటం జరిగింది.


యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును. (మత్తయి 12:40)


యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచనగా ఉండెనో ఆలాగే మనుష్య కుమారుడును ఈ తరమువారికి సూచనగా ఉండును. (2)


యేసు క్రీస్తు యొక్క మరణం పునరుద్దానం మానవ చరిత్రలోనే ఒక పర్వత శిఖరం వంటిది.


✝️అది సరైన సమయంలో జరిగింది (1 తిమోతి 2:6).


✝️అది దేవుని కృపామహదైశ్వర్యం బట్టి జరిగింది, పాపానికి ఇదే ఏకైక పరిష్కారం (ఎఫెస్సీయులకు 1:7).


✝️ఇది నిత్యత్వపు బహుమానం (యోహాను 3:16).


✝️ఇది అన్ని కాలాల్లోకెల్లా అత్యంత ఖరీదైన బహుమానం (1 కొరింథీయులకు 6:20; మత్తయి 26:38 & 42).


జనులు దేవుని నమ్మటానికి ఇంతకంటే వేరే సూచన అవసరం లేదు.


--------------------


(1) మత్తయి 12:39; మత్తయి 16:4
(2) యోనా 3; మత్తయి 12:40; లూకా 11:30


Did Jesus Really Say That About Jonah?


యేసు ప్రభువు తన మరణం పునరుద్దానం గురించి ఒక సూచనగా యోనాను ఎందుకు ఉపయోగించారో ఒక్క నిమిషంలోనే చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానంలో చూద్దాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.