దేవునికి ఎక్కువ ఉపయోగకరంగా

కొన్నిసార్లు ఎక్కడైతే మనం ఓడిపోతామో, అక్కడే మన విజయం ప్రారంభం అవుతుంది. ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.


ఒక సమయంలో నా జీవితం చాలా సులువుగా సాగింది.. జీవితంలో అన్ని సమస్యలకు కావలసిన 'బైబిల్ సూత్రాలు' నా దగ్గర ఉన్నాయి అనుకున్నాను.


తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో సమస్యలు, గుండె పగిలిన సందర్భాలు, ఇంకా ఇతర కఠినమైన సవాళ్లు, నేను అనుభవించేక గాని నాకు తెలీలేదు నా దగ్గర ఉన్న ఆ సూత్రాలు వాక్యానుశారమైనవి కావని.


నేను నిజమైన విశ్వాసిని, కాని నా విశ్వాసం అప్పటివరకు పరీక్షంపబడలేదు, అది లోతైనది కాదు.


నేను అనుకున్నాను ఇన్ని సమస్యలతో విరిగిపోయాను నలిగిపోయాను కాబట్టి ఇంక నేను దేవునికి ఉపయోగకరంగా లేనేమో అని. ఎందుకంటే నా జీవితం నేను ఊహించుకున్నట్టు పరిపూర్ణమైన చిత్రంగా లేదు కాబట్టి.


కాని వాస్తవంగా, నేను ఇంకా ఉపయోగకరంగా తయారవుతున్నాను.


నాలో ఏదో నూతన కార్యం జరుగుతుంది.


నేను ఓర్పులో, విశ్వాసంలో ఎదుగుతున్నాను.


మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. మీరు సంపూర్ణులును, అనూనాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. (యాకోబు 1:3,4)


నేను ఇంకా ఆ ప్రయాణంలోనే ఉన్నాను, కొన్నిసార్లు పడిపోతుంటాను, అయినప్పటికీ ఓర్పులో కొనసాగుతూ దేవునిలో బలంగా ఎదుగుతూ ఉంటున్నాను.


క్రైస్తవ్యం అంటే ఒక 'విశ్వాస సూత్రం' కాదు. అది క్రియాశీలకమైనది, సజీవమైనది, ఉపయోగకరమైనది, మర్మమైనది, అద్భుతమైనది కూడా.


మానవ సూత్రాలు ఓడిపోతాయి, కాని వాక్యంలో ఉన్న ప్రతీ మూలసూత్రం పరీక్షంపబడి, సత్యమైనవిగా నిరూపించబడినవి (సామెతలు 30:5)


More Useful to God


కొన్నిసార్లు ఎక్కడైతే మనం ఓడిపోతామో, అక్కడే మన విజయం ప్రారంభం అవుతుంది. ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.