మనతో మనమే చెప్పుకునే వ్యతిరేకమైన మాటల ప్రభావం

ఒక్క నిమిషంలో మనం ఎన్ని వ్యతిరేకమైన మాటలు ఆలోచించగలమో ఆ సంఖ్య తెలిస్తే, ఆశ్చర్యపోవాల్సిందే. వ్యతిరేకపు ఆలోచనలు జయించుటకు దేవుని పరిశుద్ధ గ్రంధం నుండి జవాబులను ఈరోజు వాక్యధ్యానంలో తెలుసుకుందాం!

మామూలుగా మనం నిమిషానికి 120 మాటలు ఇతరులతో మాట్లాడితే, నిమిషానికి 1300 మాటలు మనతో మనమే మన ఆలోచనల్లో మాట్లాడుతామని పరిశోధకులు నిర్ధారించారు.


నేనెందుకు నా సమస్యలకు అంతగా క్రుంగిపోతానో అది ఎక్కడ మొదలవుతుందో ఇంక వేరే చెప్పక్కర్లేదు. పది నిమిషాలు మనకు మనమే వ్యతిరేకమైన మాటలు చెప్పుకోవడాన్ని ఊహించండి. అంటే 13,000 బాధతో, కోపంతో, నిరుత్సాహంతో నిండిన మాటలను నా ఆత్మలోనికి నేనే ఎక్కించుకుంటున్నాని అర్ధం.


2 కొరింథీయులకు 10:5 లో ఈ విధంగా చెప్పబడింది, "మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి"


మనం వ్యతిరేకమైన ఆలోచనలను ఆలోచించడం మొదలుపెట్టగానే, వెంటనే వాటిని పడద్రోసే, ఆ ఆలోచనలను చెరపట్టే తీవ్రమైన పనికి పూనుకోవాలి.


ఇది ఒక యుద్ధరంగానికి పోలి ఉంది - ఏ యుద్ధమైనా మన ఆలోచన పరిధిలోనే జయించవచ్చు లేక ఓడిపోవచ్చు అనేదాన్ని ఇది జ్ఞాపకం చేస్తుంది.


శత్రువు వేసే ఈ ఆలోచనలతో యుద్ధం చేసి గెలిచేందుకు కొన్ని మార్గాలు ఏమిటి?


1. మనకున్న సమస్యకు సంబంధించిన దేవుని వాక్యాలను కంఠత పెట్టడం.

2. వ్యతిరేకమైన ఆలోచనలను, మనకున్న ఆశీర్వాదాలను లెక్కించడంతో అడ్డుకోవడం.

3. వ్యతిరేకమైన ఆలోచనల స్థానంలో దేవుని స్తుతించే స్తుతులతో నింపడం (ఆయన గొప్ప ప్రేమను ధ్యానిస్తూ)


కనుక ఎప్పుడు ఈ యుద్ధం మొదలైనా, పోరాడుదాం!


The Power of Negative Self-Talk


ఒక్క నిమిషంలో మనం ఎన్ని వ్యతిరేకమైన మాటలు ఆలోచించగలమో ఆ సంఖ్య తెలిస్తే, ఆశ్చర్యపోవాల్సిందే. వ్యతిరేకపు ఆలోచనలు జయించుటకు దేవుని పరిశుద్ధ గ్రంధం నుండి జవాబులను ఈరోజు వాక్యధ్యానంలో తెలుసుకుందాం!




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.