దైవభక్తి గలవారు క్రుంగినప్పుడు..

దైవభక్తిగల క్రుంగిన వారిని గూర్చి పరిశుద్ధ గ్రంధంలో చెప్పబడింది. వారిలో కొందరి జీవితాలను పరీక్షిద్దాం. మనం క్రుంగినపుడు  ఉపయోగపడుతుంది!

కొన్నిసార్లు క్రుంగుదల బలహీనమైన విశ్వాసానికి సూచనగా మనం అనుకుంటాం. కాని అది నిజమేనా?


• "దేవుని హృదయానుసారుడు" అని పిలవబడ్డ దావీదు, తాను క్రుంగినపుడు, విరక్తిగా ఉన్నప్పుడు చాలా కీర్తనలు వ్రాసాడు (అపో. కార్యములు 13:22). గొప్ప బాధ, అనేక నిద్రలేని రాత్రులు, భయం, ఆందోళన, నొప్పి లాంటి ఎన్నింటినో ఆయన అనుభవించాడు. దేవునిచేత విడువబడినట్లు కూడా చాలా సార్లు దావీదు అనుకున్నాడు (కీర్తనలు 13:1-4).


• యిర్మియా ఇంకో ఉదాహరణ. ఇతను దేవునికి గొప్ప సేవకుడు అయినా, ఎంతో నిరుత్సాహన్ని, క్రుంగుదలను అనుభవించాడు. చెప్పాలంటే, తాను జన్మించిన ఆ రోజును కూడా యిర్మియా శపించాడు (యిర్మియా 20:7-18).


• దేవునిచేత ఎంతో మెప్పును పొందిన యోబు కూడా తాను జన్మించకుండా ఉండి ఉంటే బాగుండేది అని ఆశించాడు (యోబు 1:8; యోబు 3).


• గొప్ప ప్రభావాన్ని కలిగిన ఇంకొక దేవుని సేవకుడైన ఏలియా కూడా దేవుని వలన ఒక గొప్ప విజయం సాధించిన తరువాత చాలా తీవ్రమైన క్రుంగుదలకు లోనవడం మనం చూస్తాం (1 రాజులు 18-19).


• అపొస్తులుడైన పౌలు కూడా "తాను బ్రతుకుతాడనే నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు" (2 కొరింధీయులకు 1:8).


మనం కూడా ఒకవేళ క్రుంగిపోతే, ఈ వ్యక్తులు చేసినట్టే చేయొచ్చు :
దేవుని నమ్మకత్వాన్ని గుర్తుచేసుకోని, ఆయన పై పూర్తిగా ఆధారపడొచ్చు (యిర్మీయా 31:3; కీర్తన 13:5-6; 2 కొరింధీయులకు 1:9).


మానవ బలహీనతలను అర్ధం చేసుకొని, ఎంతో ప్రేమతో మనకు సహాయపడే దేవుణ్ణి కలిగి ఉండటం నిజంగా ఎంత ధన్యత!


"తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది..." (కీర్తనలు 103:13,14)


గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు. (కీర్తనలు 147:3)


When Godly People Get Depressed


దైవభక్తిగల క్రుంగిన వారిని గూర్చి పరిశుద్ధ గ్రంధంలో చెప్పబడింది. వారిలో కొందరి జీవితాలను పరీక్షిద్దాం. మనం క్రుంగినపుడు  ఉపయోగపడుతుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.