హృదయాలు - పై రూపాలు

దైవికమైన వ్యక్తి అయిన సమూయేలు సహితం పైరూపం మీదే మనసు పెట్టాడు. అసలు పైరూపం గురించి దేవుడు ఏమి చెప్తున్నాడో ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానంలో తెలుసుకుందాం!

వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్స్ ప్రకారం "అందంగా ఉండేవారినే ఉద్యోగాల్లో పెట్టుకుంటారంట, తక్కువ అందంగా ఉన్న వారికంటే వీరే ఎక్కువ జీతాలు సంపాదిస్తారంట"


దేవుని పోలికలో చేయబడినవారం అయినప్పటికీ, దేవునికి ముఖ్యం కాని పైకి కనబడే వాటపై మనం ఎంత దృష్టి పెడతామో కదా.


దైవికమైన వ్యక్తి అయిన సమూయేలు కూడ, అలానే, బాగా పొడవుగా, ఆకర్షనీయంగా ఉన్న దావీదు అన్ననే దేవుడు ఎన్నుకుంటాడు అని అనుకున్నాడు. కాని దేవుడు ఎవ్వరినీ పై రూపాన్ని బట్టి తీర్పు తీర్చడు.


అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. (1 సమూయేలు 16:7)


దేవుడు మన ఉద్దేశాలను చూస్తాడు :

"ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును." (సామెతలు 16:2)


దేవుడు మన క్రియలను చూస్తాడు :

ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. (యిర్మీయా 17:10)


దేవుడు మన జీవితాలలో మనం ఎక్కడ రాజీపడిపోయామో చూస్తాడు :

మా దేవుని నామమును మేము మరచియున్నయెడల అన్యదేవతలతట్టు మా చేతులు చాపియున్నయెడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? (కీర్తనలు 44:20, 21)


మనం పైకి ఎంత అందంగా ఉండాలో ఎంపిక చేసుకోలేం. కాని హృదయాన్ని అందంగా ఉంచుకునే ఎంపిక మాత్రం మనం చేసుకోగలం. అందంగా మారటం కోసం అన్నింటికంటే ప్రభావవంతమైన చికిత్స ఏమిటంటే యేసయ్యకు దగ్గరగా జీవించడమే.


Hearts vs. Faces


దైవికమైన వ్యక్తి అయిన సమూయేలు సహితం పైరూపం మీదే మనసు పెట్టాడు. అసలు పైరూపం గురించి దేవుడు ఏమి చెప్తున్నాడో ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానంలో తెలుసుకుందాం!



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.