అబద్దబోధలు ఎక్కువ ప్రాముఖ్యత పొందడానికి మూడు కారణాలు

అబద్ద బోధల యొక్క గుణాన్ని కొలొస్సయులకు 2:8 వివరిస్తే, ఈరోజు వాక్యధ్యానం అవి ప్రాముఖ్యత పొందడానికి మూడు కారణాలను వివరిస్తుంది.


ఒకసారి ఒక టి.వి సువార్తికుడు 'నేనే' అనే మాటలో చాలా శక్తి ఉందని ప్రకటించి, తనని వెంబడించే వారికి తమను తాము 'నేను అందమైన వ్యక్తిని, నేను ప్రత్యేకమైన వ్యక్తిని' అని తరచుగా ప్రశంసించుకోవాలని వారిని ప్రోత్సాహించాడు. (1)


139 కీర్తనను ఉదహరించి, దానిలోని అర్ధాన్ని వక్రీకరించి.. అద్భుతమైన దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించడం బదులు మానవుణ్ణి ఎక్కువగా చేసి చెప్పడం జరిగింది. అతను ఎంత దూరం వెళ్లిపోయాడంటే, మానవులు తాము గొప్పవారమని తమపై తమకు నమ్మకం కుదిరడం పైనే దేవుని ప్రణాళికలు ఆధారపడి ఉన్నాయని చెప్పాడు.


ఆ పెద్ద స్టేడియంలో వేలకొలది ప్రజలు ఆ వ్యక్తి చెప్పిన ప్రతీ మాటను పట్టుకొని ఊగిపోయారు.


ఈ క్రింద విధమైన వాక్యాలను చదివితే అబద్ద బోధలను గుర్తుపట్టడం సులభం అవుతుంది :


ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థకతత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. (కొలొస్సయులకు 2:8)


✝️ అబద్ద బోధలు :


1. మోసకరమైనవి :
ఆ బోధలు నిజమైనవి కాకపోయినా పైకి మాత్రం మంచివిగా కనిపిస్తాయి (ఎఫెస్సీయులకు 5:6).


2. ఆకర్షణీయమైనవి:
మనుష్యుల పారాంపర్యాచారాలకు ఆకర్షణీయమైనవిగా అవి కనబడుతాయి. మనుష్యులు సాధారణంగా వారి దృష్టికి ఏమి విలువైనవని నమ్ముతారో వాటినే వారు ప్రకటిస్తారు (ఎఫెస్సీయులకు 4:22). (2)


3. లోకానుశారమైన :
ఇది 'లోకమూలపాఠములను' ఆధారం చేసుకున్నది. కనుక లోకులకు ఇది జ్ఞానముగా పరిగణించబడుతుంది (1 కొరింధీయులకు 1:20)


అందుకే ప్రతీ బోధను సత్యమైన, దేవునిచే ఇవ్వబడిన దేవుని వాక్య సూత్రలతో పరీక్షించడం చాలా కీలకమైనది.


-------------------


(1) రోమీయులకు 12:3, సామెతలు 27:2 కూడా చూడండి
(2) దేవుని స్థానంలో మనుషులు పెట్టే ఏదైనా దీనికి వర్తిస్తుంది - ఉదాహరణ : లీగలిజం, ధనం, తమపై తాము ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం మొదలగునవి.


3 Reasons False Teachings are So Popular


అబద్ద బోధల యొక్క గుణాన్ని కొలొస్సయులకు 2:8 వివరిస్తే, ఈరోజు వాక్యధ్యానం అవి ప్రాముఖ్యత పొందడానికి మూడు కారణాలను వివరిస్తుంది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.