'మిషనరీ' అంటే నీ అర్ధం ఏమిటి?

ఎక్కవ శాతం మంది 'మిషనరీ' అనే మాటను తప్పుగా అర్ధం చేసుకున్నారు. మరి నువ్వు? దీనినే ఒక్క-నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది.


మనలో చాలా మంది మిషనరీ అంటే 'ఒక వ్యక్తి క్రీస్తు గురించి విదేశంలో ప్రకటించటం' అని అనుకుంటారు.


కాని మిషనరీకి నిజమైన అర్ధం ఏమిటంటే 'ఒక వ్యక్తి మిషన్ మీద ఉండటం' అని. అంటే అది ప్రతీ క్రైస్తవునికి వర్తిస్తుంది, తన సొంత గ్రామాన్ని వారు అసలు ఎప్పుడూ విడువనప్పటికీ కూడా (మత్తయి 28:9; ఎఫెస్సీయులకు 5:15-16).


అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను (అపొస్తలుల కార్యములు 1:8)


మనం 'భూదిగంతములవరకును' అనే మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసి, శిష్యులకు అప్పగింపబడిన అక్కడ వ్రాయబడిన ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము :

• యెరూషలేము -  ప్రస్తుతం ఉంటున్న ప్రాంతం

• యూదయ - తమకి దగ్గర ఉన్న తమలాంటి వారికి

• సమరయ - తమకి దగ్గర ఉన్న ఇతర విశ్వాసాలకు సంబంధించిన వారికి


ప్రతీ క్రైస్తవుడు ఈ ప్రాంతాలలో కనీసం ఒకదానికైనా క్రీస్తును ప్రకటించాలి.


క్రీస్తును గురించి తమ చుట్టూ ఉన్న వారికి చెప్పడం చాలా సహజమైన పద్దతిలో జరగాలి .. దేవుడు తమ జీవితాన్ని ఎలా మార్చారో, తమ వ్యక్తిగతమైన అనుభవాన్ని చెప్పడమే అత్యంత ప్రభావవంతమైన విధానం.


నీవు ఉంటున్న ప్రాంతంలోనే ఒక ముఖ్యమైన మిషనరీగా నీవు కూడా ఉండగలవు.. ప్రోత్సాహాన్ని పొందు!


What's Your Definition of a Missionary?


ఎక్కవ శాతం మంది 'మిషనరీ' అనే మాటను తప్పుగా అర్ధం చేసుకున్నారు. మరి నువ్వు? దీనినే ఒక్క-నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.