ఇంకొక్క అవకాశం

దేవుడు ప్రతీ సారీ ఇంకో అవకాశం ఇస్తారు అని ఇతరులకు భరోసా ఇవ్వడం వాక్యానుశారమేనా? అది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఒక్క నిమిషం లో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.


ఆమె తన ఫోన్లో మెసేజ్ లు చేస్తూ, తన కార్ ని నడుపుతూ, ఆగమన్న సైన్ ని దాటేసి, పక్కదారికి పొరపాటున వెళ్ళిపోయింది. తన చేసిన ఆ పొరపాటు వల్ల తన కార్ మూడు సార్లు పాల్టీ కొట్టేసింది.. అయినా ఏదోరకంగా ఆమె బ్రతికి గొప్ప ప్రమాదాన్ని తప్పించుకుంది.


అందుకనేనేమో ఆమె తరువాత కార్ ని నడుపుతూ మెసేజ్ చేయడం నేరం అని వాదించే న్యాయవాది అయింది.


కాని ఒక సంవత్సరం తరువాత ఆమె చనిపోయింది.. ఎందువల్ల? ఊహించారా: ఆమె కార్ ని నడుపుతూ మెసేజ్ చేయడం వల్లే.


అంతకుముందు మరణానికి చాలా దగ్గరకు వచ్చి, తప్పించుకున్న వ్యక్తి అయి ఉండి కూడా, అదే ప్రమాదకర చర్యను మరలా ఎలా చేసింది?


ఆత్మీయ పరిస్థితిలో కూడా ఇది వాస్తవమైనది : ప్రజలు పాపంతో తమ జీవితాలను నాశనం చేసుకుంటుంటే, దేవుడు తప్పించుకునే అవకాశం ఇచ్చినా, ఆ అవకాశాన్ని వాడుకోని మరలా అవే పాపాలలోనికి తిరిగి వెళ్ళిపోతున్నారు (సామెతలు 26:11).


నేను కేవలం మత్తు మందులకు బానిస అయిపోయిన వారి గురించే మాట్లాడటంలేదు కాని, నీ గురించే నా గురించే మాట్లాడుతున్నాను.


దేవుని సహనానికి హద్దులు లేవని నీవు అనుకుంటున్నావా? 'ఇంకొక్కసారి' చేస్తే ఏమీ నష్టపోములే అని అనుకుంటున్నావా?


ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును. (సామెతలు 29:1)


యేసు అన్నారు 'నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు' (యోహాను 14:21-23)


దేవుణ్ణి ప్రేమిద్దాం, లోబడదాం, ప్రియ స్నేహితులారా!


One More Chance


దేవుడు ప్రతీ సారీ ఇంకో అవకాశం ఇస్తారు అని ఇతరులకు భరోసా ఇవ్వడం వాక్యానుశారమేనా? అది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఒక్క నిమిషం లో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.