మన విశ్వాసాన్ని పరీక్షించే అన్ని శ్రమలు కంటే మించిన పరీక్ష ఒకటి ఉందని యోబు జీవితం మనకు చూపిస్తుంది.
యోబు తన బిడ్డలను, ఆస్తిని, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, అయినప్పటికీ విశ్వాసంతో, దేవుని పై నమ్మకంతో స్పందించాడు :
యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. (యోబు 1:21)
కాని తన శ్రమ కొనసాగే కొలది, దేవుడు తనను ఎడబాసేడేమో అని అయోమయంతో ఆలోచించడం మొదలుపెట్టాడు :
నేటివరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూలుగుకంటె భారముగానున్నది. ఆయన నివాసస్థానము నొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. (యోబు 23:2-3)
యోబుకు అన్నింటినీ కోల్పోగలిగే అంత విశ్వాసం ఉంది... ఒక్క దేవుణ్ణి తప్ప.
ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. (యోబు 23:3)
మనలో చాలా మంది జీవితంలో ఇలాంటి పరిస్థితికే చేరుకుంటాం ఎందుకంటే మన జీవితంలో జరిగే చాలా విషయాలు ఎందుకు జరుగుతున్నాయో మనకు అర్ధం కాదు కాబట్టి. దేవుడు కూడా అర్ధం అవుతాయి అని ఎక్కడా మనకు వాగ్దానం చేయలేదు.
వాస్తవంగా చెప్పాలంటే ఈ స్థితి మన విశ్వాసానికి పరీక్ష. మన అయోమయానికి అర్ధం చెప్పుకోవడానికి దేవుణ్ణే మనం తప్పుగా అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామా? ఆయన్ని తృణీకరిస్తామా? లేక ఏమీ అర్ధం కాకపోయినా సరే ఆయన్నే గట్టిగా నమ్ముకుంటామా? (1 కొరింథీయులకు 13:12) ?
జీవితం మన పై వేసే ప్రతీ దానికి అర్ధాన్ని చెప్తాను అని ప్రభువు మనకు వాగ్దానం చేయకపోవచ్చు. ఆయన యోబుకు కూడా పూర్తిగా అర్ధమయ్యేలాగా ఏమీ వివరించలేదు. కాని దానికంటే ఉన్నతమైన దానిని ఆయన వాగ్దానం చేశారు : ఆ వాగ్దానం ఏమిటంటే, 'నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను' అని (హెబ్రీయులకు 13:5)
కనుక 'మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడాన్ని' మానేసి, ఆయనయందు సంపూర్ణ నమ్మిక ఉంచుదాం! (సామెతలు 3:5)
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.