ప్రకాశించుటకు ఏడు మార్గాలు

ఒక్క నిమిషంలో చదువుగలిగిన ఈరోజు వాక్యధ్యానం క్రీస్తు కొరకు ప్రకాశించుటకు ఏడు మార్గాలను వివరిస్తుంది. చీకటిలో ప్రకాసిస్తున్నావా, ప్రియ క్రైస్తవుడా?


క్రైస్తవులు ఈ లోకానికి వెలుగుగా ఉండాలి అని యేసు ఆజ్ఞాపించారు (మత్తయి 5:14). దీని అర్ధం ఏమిటి? మన వెలుగును దాచకుండా ప్రకాశించడం ఎలా? (మత్తయి 5:14-15)


1. చీకటిలో నుండి మనం పిలవబడ్డామని గుర్తుపెట్టుకోవాలి (1 పేతురు 2:9)

కృతఙ్ఞతతో ఉద్దేశ్యపూర్వకంగా జీవించు.


2. యేసుతో, ఇతర వెలుగు సంబంధులతో సహవాసం కలిగి ఉండు (1 యోహాను 1:7)

ఇతర క్రైస్తవులకు కట్టుబడి, వారికి జవాబుదారీగా ఉండు (హెబ్రీయులకు 10:24-25).


3. దేవునికి మహిమ తెచ్చే మంచి క్రియలతో కూడిన దైవికమైన జీవితాన్ని జీవించు (మత్తయి 5:16).

దేవుడు ముందుగా సిద్దపరచి ఉంచిన సత్క్రియలు చెయ్యి (ఎఫెస్సీయులకు 2:10)


4. దేవునికి విధేయత చూపించు (ఎఫెస్సీయులకు 5:8-9)

నిజంగా ఆయనను ప్రేమిస్తున్నామో లేదో తెలిపే అసలైన పరీక్ష ఇదే అని యేసు చెప్పారు (యోహాను 15:14).


5. దేవునికి ఇష్టమైనది ఏమిటో తెలుసుకో (ఎఫెస్సీయులకు 5:10)

ఆయన వాక్యమును చదువుతూ, ఆయన నడిపింపు కోరు (యిర్మీయా 9:23-24).


6. చీకటి సంగతులకు దూరంగా ఉండు (ఎఫెస్సీయులకు 5:11-13).

పాపమును హెచ్చించే అబద్ద తత్వజ్ఞానమును, అనైతిక విలువలను, వినోదాలను, చెడు పుస్తకాలను, సంగీతాన్ని ఇలా వివిధమైన లోకానుశారమైన వాటితో నీ విశ్వాసాన్ని కలుషితం చేయనీయకు.


7. అంధకార క్రియలను ఖండించు కాని వాటిమీదే నీ దృష్టి నిలపకు (ఎఫెస్సీయులకు 5:11-14)

దైవిక విలువలు గురించి చెప్పడానికి సిగ్గుపడకు కాని అంధకార క్రియల వివరణ మీద నీ మనస్సు పెట్టకు.


7 Ways to Shine


ఒక్క నిమిషంలో చదువుగలిగిన ఈరోజు వాక్యధ్యానం క్రీస్తు కొరకు ప్రకాశించుటకు ఏడు మార్గాలను వివరిస్తుంది. చీకటిలో ప్రకాసిస్తున్నావా, ప్రియ క్రైస్తవుడా?


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.