మీరు పోయబడుతున్నారా?

పౌలు తాను "పానార్పణముగా పోయబడుటను" గురించి మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం లో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.


ఫిలిప్పీయులకు 2:17 లో పౌలు  ఫిలిప్పీయుల విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను తాను "పానార్పణముగా పోయబడుటను" గురించి సంతోషించడం చూస్తాం. (1)


దీనర్ధం ఏమిటి?


పానార్పణము అనేది పాత నిబంధన గ్రంధంలో చెప్పబడిన బలియాగ ఆచారాలలో భాగంగా ఉన్నా, అది యేసు యొక్క బలియాగానికి ఒక సూచనగా ఉంది (సంఖ్యకాండము 28). పాత నిబంధన గ్రంధంలో చెప్పబడిన అర్పణలపై పోయబడే మద్యము యేసు యొక్క రక్తానికి సూచనగా ఉంది.


అదే విషయం యేసు తన మాటల్లోనే చెప్పారు : ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. (లూకా 22:20)


పౌలు తన రక్షకుడైన యేసులాగే తాను కూడా ఇతరుల విశ్వాసం కొరకు తన యొక్క జీవితం కూడా పానార్పణముగా పోయబడుతుంది అని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో వివరించాడు. చెప్పాలంటే పౌలు తాను విశ్వాసించిన దాని కోసం శిరచ్చేదనం చేయబడ్డాడని ఆధారాలు ఉన్నాయి.


మనందరం కూడా శిరచ్చేదనం చేయబడాలి అని దీని అర్థం కాదు గాని, క్రైస్తవులంగా మన జీవితాలు కూడా మన ప్రభువు కొరకు పానార్పణముగా పోయబడాలి అని : ఎలా అంటే -


1. సజీవ యాగాలుగా, దేవుని వాక్యంచే మన మనస్సులు మార్చుకొనుట ద్వారా (రోమీయులకు 12:1-2).


2. పాప స్వభావాన్ని జయించుటకు ప్రయాసపడుట ద్వారా (ఫిలిప్పీయులకు 2:12-13; ఎఫెస్సీయులకు 4:22-24).


3. మన జీవితాలలో దేవుని చిత్తం నెరవేర్చుట ద్వారా (ఎఫెస్సీయులకు 2:10)


ఒకవేళ ఇవి మీరు చేయకుండా ఉన్నట్లయితే, ఇప్పుడే మొదలుపెట్టండి ప్రియ క్రైస్తవులారా!


నోట్స్ :
తాను పానార్పణముగా పోయబడుటను గురించి పౌలు తాను సరిగ్గా చనిపోయే ముందు 2 తిమోతి 4:6 లో కూడా చెప్పాడు.


Are You Being Poured Out?


పౌలు తాను "పానార్పణముగా పోయబడుటను" గురించి మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం లో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.