చెడు ఆదరణ కర్తలు - మంచి ఆదరణ కర్తలు

చెడు ఆదరణ కర్తలు చాలా మంది ఉంటారు, కాని బాధపడేవారికి మనం మంచి ఆదరణ కర్తలుగా ఉండొచ్చని దేవుని వాక్యం మనకు మంచి సలహా ఇస్తుంది.


బాధపడేవారికి తన బిడ్డలు మంచి ఆదరణకర్తలుగా ఉండాలని దేవుడు ఆశిస్తాడు (2 కొరింధీయులకు 1:3-6).


దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. (2 కొరింథీయులకు 1:4)


✝️దైవికమైన ఆదరణకర్తలు:


1. అడగని సలహాలు ఇవ్వకుండా, ఇతరుల బాధలు పంచుకుంటారు (1).


ఒకవేళ వారిలో ఏదైనా తెలిసిన లోపం ఉంటే, సత్యాన్ని ప్రేమతో కలిపి చెప్పాలి (మత్తయి 18:15; 1 కొరింథీయులకు 5:12; యాకోబు 5:19-20).


కాని వాస్తవంగా చాలా మంది విపరీతమైన పరిస్థితులు ద్వారా వెళ్తూ బాధలను అనుభవిస్తున్నారు. మనం వారి సమస్యలకు పరిష్కారం కనుక్కోగలం అనుకుంటే మనం కూడా యోబు స్నేహితుల్లానే అహంకారులం అనమాట.


దానిబదులు బాధపడే వారి బాధను పంచుకుందాం (2) (రోమీయులకు 12:15)


2. చెప్పడంకంటే వింటారు :


యాకోబు 1:19 కోపపడటం గురించి చెప్పినా, ఆదరణకు ఉపయోగపడే రెండు సిద్ధాంతాలు అక్కడ చెప్పబడ్డాయి : వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి.


3. గుసగుసలు చెప్పడం బదులు ప్రార్ధిస్తారు:


చెడు ఆదరణ కర్తలు ఒకరి బాధలు ఇంకొకరితో వారి అనుమతి లేకుండా చెప్పేస్తారు. మంచి ఆదరణ కర్తలు ప్రార్ధిస్తారు (ఎఫెస్సీయులకు 6:18).


మంచి ఆదరణ కర్తలు చాలా అరుదు.. సమస్యలలో ఉన్నప్పుడు వారి ఆదరణ చాలా అద్భుతం.


మంచి ఆదరణ కర్తలు మనలను ఆదరించడం కంటే ఎక్కువ మేలే చేస్తారు... అదేమిటంటే ఇతరులను ఎలా ఆదరించాలో నేర్పుతారు.

------------------


(1) సలహా ఒకవేళ అడిగితే ఇవ్వొచ్చు కాని ఆ పని చాలా జాగ్రత్తగా చెయ్యాలి.


(2) ఇతరుల బాధను పంచుకోవడం అంటే అది సానుభూతికి మించినది. అది ఇతరుల భావాలు బాధలు పంచుకోవడం (తమ సొంతవిగా).


Bad Comforters and Good Comforters


చెడు ఆదరణ కర్తలు చాలా మంది ఉంటారు, కాని బాధపడేవారికి మనం మంచి ఆదరణ కర్తలుగా ఉండొచ్చని దేవుని వాక్యం మనకు మంచి సలహా ఇస్తుంది.





No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.