ఒకవేళ నువ్వు చాలా మురికిగా ఉండి, చదువు లేక, చాలా పెద్ద నేరం చేసి, క్రూరమైన నేరం చేసావని రుజువై, ఉరి తీయబడటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తివి అనుకో.
ఆశ్చర్యకరంగా, ఆకస్మాతుగా ఒక వ్యక్తి నీ స్థానంలో చనిపోవడానికి వచ్చి , అతని ఆస్తికి నిన్ను వారసుడుగా చేసి, తన కుటుంబంలో నిన్నూ ఒకడిగా చేసాడనుకో..
ఇది నిజం కాదు, ఊహించలేనిది అని అనిపిస్తుంది కదా?
కాని ఇది నిజమైన కధ. దేవునికి మనపై ఉన్న ప్రేమ ఈ కధ.
వాస్తవంగా ఆత్మీయంగా మనమందరం మరణ శిక్ష పొందడానికి సిద్ధంగా ఉన్న నేరస్తులం, పూర్తిగా అయోగ్యులం, 'నడుస్తూనే ఉన్నా చనిపోయిన వారం'. (1):
# అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. (రోమీయులకు 3:12)
# "పాపమువలన వచ్చు జీతము మరణము".. (రోమీయులకు 6:23)
# అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. (రోమీయులకు 5:8)
*దేవుడు మన స్థానంలో చనిపోవడంతో పాటు, మనలను తన కుటుంబంలో చేర్చుకోని, తన స్వాస్థ్యమునకు అర్హత లేని మనలను వారసులుగా చేశాడు.*
# మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమననుగ్రహించెనొ చూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. (1 యోహాను 3:1)
# ఆయన మనకు - అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్యము... పరలోకమందు దాచి ఉంచారు . (1 పేతురు 1:4)
మనం ఒకప్పుడు 'నడుస్తూనే ఉన్న చనిపోయిన వారం'.. కాని ఇప్పుడు 'చనిపోయినా బ్రతికి ఉన్నవారం' (యోహాను 11:25) (2)
-----------------
(1) ఈ మాటను ఉరి సిద్ధంగా ఉన్న వ్యక్తిని వివరించడానికి ఉపయోగిస్తారు, ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోవడానికి (ఉరి) నడుస్తూ వెళ్తాడు కాబట్టి.
(2) మనం 'చనిపోయినా బ్రతికి ఉన్నవారం' అనే మాట రెండు విధాలుగా ఉపయోగిస్తాం : మనం నేరశిక్షకు తగినవారం అయినపుడు యేసు మనకు జీవం ఇచ్చాడు, మనం మన స్వార్ధానికి చనిపోయి, యేసు కోసం బ్రతికి ఉన్నవారం.
(లూకా 17:33).
What Kind of Dead Man Are You?
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.